CBN Kuppam : కుప్పం ప‌ర్య‌ట‌న‌పై పోలీస్ జులుం! క‌ర్ణాట‌క‌, ఏపీ బోర్డ‌ర్లో హై టెన్ష‌న్‌!

కుప్పంలో (CBN Kuppam) హై టెన్ష‌న్ నెల‌కొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 02:55 PM IST

కుప్పంలో (CBN Kuppam) హై టెన్ష‌న్ నెల‌కొంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశం మేర‌కు అమ‌లులోకి వ‌చ్చిన కొత్త జీవో రాజ‌కీయ హీట్ ను పెంచింది. మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబును ఏపీలోకి అడుగు పెట్ట‌కుండా పోలీసులు (Police) భారీగా మోహ‌రించారు. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌చార ర‌థాన్ని, వాహ‌నాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క‌ర్ణాట‌క‌, ఏపీ స‌రిహ‌ద్దుల్లో బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. వాటిని తొల‌గించ‌డానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ క్యాడ‌ర్ మ‌ధ్య ఉద్రిక్త‌త నెల‌కొంది.

Also Read : NCBN: అధికారంలోకి వస్తే 3వేల పెన్షన్ : గుంటూరు సభలో చంద్రబాబు

కొత్త జీవో ప్ర‌కారం అనుమ‌తి లేకుండా చంద్ర‌బాబు రోడ్ షోలు, స‌భ‌లు నిర్వ‌హించ‌డానికి లేద‌ని పోలీసులు చెబుతున్నారు. ముందుగా ఖ‌రారైన షెడ్యూల్ ప్ర‌కారం కుప్పం ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు (CBN Kuppam) వెళ్లారు. హైద‌రాబాద్ నుంచి విమానంలో బెంగుళూరు చేరుకున్నారు. అక్క‌డ నుంచి ఆయ‌న రోడ్డ మార్గాన కుప్పం చేరుకోవ‌డానికి షెడ్యూల్ చేసుకున్నారు. ఆ మేర‌కు చంద్ర‌బాబు కు భ‌ద్ర‌త క‌లిగిస్తోన్న జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ సిబ్బంది స్థానిక పోలీసుల‌కు(Police) స‌మాచారం ఇచ్చారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్తమైన పోలీసులు భారీకేడ్ల‌ను ఏర్పాటు చేసి, ఏపీ స‌రిహ‌ద్దుల్లోకి చంద్ర‌బాబును రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం మొదలు పెట్టారు. పోలీసుల చ‌ర్య‌లు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది.

కుప్పంలో షెడ్యూల్ ప్ర‌కారం చంద్రబాబు పర్యటన 

కుప్పం నియోజకవర్గంలో షెడ్యూల్ ప్ర‌కారం చంద్రబాబు పర్యటన మూడు రోజుల పాటు సాగనుంది. ఆ మేర‌కు ఉద‌యం 9.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉద‌యం 11.20 గంటలకు బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తారు.ఈ నెల 5న కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

Also Read : AP Tours : చంద్ర‌బాబు, షా, ప‌వ‌న్ పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జీవో! ఆపే ద‌మ్ముందా?

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పోలీసులను భారీగా మోహ‌రించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు ఆ గ్రామానికి త‌ర‌లి వ‌చ్చారు. టీడీపీ ప్రచార రథాన్ని, మరో వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు వాటిని స్టేషన్ కు తరలించారు. ఆ రెండు వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. సౌండ్ సిస్టం ఉపయోగించేందుకు అనుమతి కోరుతూ పోలీస్ అధికారులకు టీడీపీ నేతలు ఇప్పటికే లేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ తిరుగు స‌మాధానం లేదు.కుప్పం పర్యటనలో భాగంగా కేనుమాకురిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ నేతలు తలపెట్టారు. ఆ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజీని పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ లోని అన్ని గ్రామాల్లో భారీగా సిబ్బందిని మోహరించారు. ప్ర‌తి గ్రామంలోనూ కూడళ్ల వ‌ద్ద పోలీసు వాహనాలు భారీగా క‌నిపిస్తున్నాయి. కాగా, ఈ పర్యటన కోసం చంద్రబాబు బుధ‌వారం షెడ్యూల్ ప్ర‌కారం పెద్దూరు గ్రామానికి చేరుకుంటారని టీడీపీ క్యాడ‌ర్ విశ్వ‌సిస్తోంది.

అటు పోలీసులు ఇటు టీడీపీ క్యాడ‌ర్ మ‌ధ్య ఉద్రిక్త‌త (CBN Kuppam)

అటు పోలీసులు ఇటు టీడీపీ క్యాడ‌ర్ మ‌ధ్య ఉద్రిక్త‌త నెల‌కొంది. భారీగా త‌ర‌లి వ‌స్తోన్న తెలుగు సైన్యాన్ని పోలీసులు ఆపాల‌ని పెద్ద ఎత్తున మోహ‌రించారు. చంద్ర‌బాబు బెంగుళూరు విమానాశ్ర‌యంలో దిగిన విష‌యాన్ని తెలుసుకున్న క్యాడ‌ర్ ఉత్సాహం స‌రిహ‌ద్దుకు చేరుకున్నారు. ఆయ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డానికి ఏర్పాట్లు చేశారు. వాటిని అడ్డుకుంటూ పోలీసులు కొత్త జీవోను అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మూడు రోజులు కుప్పం ప‌ర్య‌ట‌న లేకుండా చంద్ర‌బాబును తిరిగి పంపించేయాల‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ ఆదేశ‌మట‌. అందుకే, పోలీసులు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం రోడ్డ మీద భైఠాయించ‌డం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం వైఖ‌రిని నిల‌దీయాల‌ని భావిస్తున్నార‌ని తెలిసింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త జీవో వ్య‌వ‌హారాన్ని తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ జీవోను ఎదిరించ‌లేని ప‌రిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జ‌న‌వ‌రి 8వ తేదీ న ఏపీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని వైసీపీ శ్రేణులు చంక‌లు గుద్దుకుంటున్నాయి. రాబోవు ప‌రిణామాల‌ను గ్ర‌హించ‌లేని ప‌రిస్థితుల్లో ఏపీ స‌ర్కార్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CBN Power : వ‌చ్చే ఎన్నిక‌ల్లో `తెలుగుదేశం`దే అధికారం! `ఆత్మ‌సాక్షి`కండిష‌న్స్ అప్లై.!