Site icon HashtagU Telugu

CBN Kuppam : చంద్ర‌బాబుపై పోటీకి పెద్దిరెడ్డి సై, కుప్పంపై వైసీపీ మైండ్ గేమ్‌

CBN Kuppam

రాజ‌కీయాల్లో మైండ్ గేమ్ కు మించిన వ‌జ్రాయుధం మ‌రొక‌టి ఉండ‌దు. అందుకే, కుప్పం వేదిక‌గా చంద్ర‌బాబునాయుడు (CBN Kuppam) మీద ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రి పెద్దిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. కుప్పంలో చంద్ర‌బాబును ఓడించ‌డంమే ల‌క్ష్యంగా పెద్దిరెడ్డి(peddireddy) మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ రాబోవు ఎన్నిక‌ల్లోనూ కుప్పం నుంచి గెలుస్తుంద‌ని ఆయ‌న చెప్పే మాట‌. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు అనుగుణంగా సాధార‌ణ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ ఉండ‌వ‌ని అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప‌దేప‌దే చంద్ర‌బాబును కుప్పం నుంచి త‌రిమి కొట్టాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబునాయుడుకు కుప్పం కంచుకోట‌(CBN Kuppam)

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడుకు కుప్పం కంచుకోట‌(CBN Kuppam). ఆయ‌న్ను అక్క‌డ ఓడించ‌డం స్థానిక సంస్థ‌ల్లో గెలిచినంత ఈజీకాదు. ఆ విష‌యం తెలుసుకున్న పెద్దిరెడ్డి(peddireddy) రామ‌చంద్రారెడ్డి ఇటీవ‌ల కుప్పం ప‌ర్య‌ట‌న‌ల‌కు చంద్ర‌బాబును రాకుండా అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జీవో నెంబ‌ర్ 1 ఆధారంగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి కూడా చంద్ర‌బాబును దూరం చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ప్లాన్ చేసింది. నిజంగా ప్ర‌జ‌ల్లో బ‌ల‌ముంటే, చంద్ర‌బాబు అంటే ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? అనేది స్థానిక నేత‌ల ప్ర‌శ్న‌. ఇటీవ‌ల ఎప్పుడు కుప్పం వెళ్లిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని వైసీపీ తీసుకుంటోంది. ఆయ‌న మీద అక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు ఫోక‌స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. అన్న క్యాంటిన్ల‌ను ద‌గ్దం చేసిన విష‌యం అందరికీ తెలిసిందే. చంద్ర‌బాబు రోడ్ షో మీద రాళ్ల‌ను విసిరిన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏదో ఒక ర‌కంగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న మీద ఆందోళ‌న క‌లిగించేలా ఇష్యూను క్రియేట్ చేస్తూ ఓట‌ర్ల‌ను పానిక్ మూడ్ లోకి పంపే మైండ్ గేమ్ ను వైసీపీ ఆడుతోంది.

Also Read : CBN Kuppam : కుప్పం ప‌ర్య‌ట‌న‌పై పోలీస్ జులుం! క‌ర్ణాట‌క‌, ఏపీ బోర్డ‌ర్లో హై టెన్ష‌న్‌!

తాజాగా మ‌రో ఎత్తుగ‌డ‌ను మంత్రి పెద్దిరెడ్డి(peddireddy) రామచంద్రారెడ్డి ర‌చించారు. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధమని స‌వాల్ విసిరారు. అంతేకాదు, కౌంట‌ర్ స‌వాల్ కూడా ఆయ‌నే విసిరారు. పుంగనూరులో నాపై పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమా? అంటూ ఛాలెంజ్ చేశారు. తాను పుంగనూరు, కుప్పం రెండు చోట్లా పోటీ చేస్తానని ప్ర‌కటించారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించ‌డం ఆయ‌న ఆడుతోన్న మైండ్ గేమ్ లోని పరాక‌ష్ట‌. పండగ పూట చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపకుండా తమపై పడి ఏడుస్తున్నాడని విమర్శించారు.

పీలేరు సబ్ జైలుకు చంద్ర‌బాబు  

వాస్త‌వంగా వైసీపీ స‌ర్కార్ ఇటీవ‌ల అరెస్ట్ చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి పీలేరు సబ్ జైలుకు చంద్ర‌బాబు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా కార్యకర్తలను పరామర్శించిన త‌రువాత వాళ్లించిన ఫీడ్ బ్యాక్ ప్ర‌కారం మంత్రి పెద్దిరెడ్డిపై ధ్వజమెత్తారు. కుప్పంలోని టీడీపీ క్యాడ‌ర్ పై మంత్రి పెద్దిరెడ్డి(peddireddy) జులుం గురించి చంద్ర‌బాబు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు. చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా బదులిచ్చారు. ఒక‌డుగు ముందుకేసి చంద్ర‌బాబుపై కుప్పం నుంచి పోటీకి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీంతో కుప్పం రాజ‌కీయం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది.

Also Read : CBN-Daggupati : తోడ‌ళ్లుల్ల మ‌ధ్య జ‌గ‌న్ స్కెచ్! ద‌గ్గుబాటి ఆప్తుడికి ప‌ర్చూరు

ప్రజల కోసం పనిచేస్తున్నాన‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సొంత డ‌బ్బా కొట్టుకున్నారు. ప‌నిలోపనిగా దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ చంద్రబాబుపై విమ‌ర్శ‌ల‌ను గుప్పించారు.అంతేకాదు సాధార‌ణంగా ఆయ‌న బ‌య‌ట‌కు వెళితే వేలాది మంది వ‌స్తుంటార‌ని సొంత డ‌బ్బా వేసుకుంటూ చంద్రబాబు కు కేవ‌లం వందల సంఖ్యలోనే కుప్పం ప‌ర్య‌ట‌న‌లో వ‌చ్చార‌ని చెప్పుకొచ్చారు. మ‌రి, ఎందుకు బ్రిటీష్ కాలం నాటి జీవో నెంబ‌ర్ 1 ద్వారా చంద్ర‌బాబు రోడ్ షోల‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేశారో, పెద్దిరెడ్డికే తెలియాలి. మొత్తం మీద కాలేజి టైంలోని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ప్ర‌స్తుతం రాజ‌కీయ బ‌ద్ధ శ‌త్రువులుగా మారారు. స్టూడెంట్ రాజ‌కీయాల నుంచి ఒక‌రి ఎత్తుగ‌డ‌లు మ‌రొక‌రికి తెలుసు. వాళ్లిద్ద‌రి రాజ‌కీయం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కూడా తెలియ‌నిది కాదు. ఇప్ప‌టి వ‌రకు వ‌రుస‌గా విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తోన్న చంద్ర‌బాబు విజ‌యాన్ని అడ్డుకోవ‌డం కష్ట‌మ‌ని తెలిసి కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సొంత డ‌బ్బా  (peddireddy)

2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆడిన మైండ్ గేమ్ ఫ‌లించింది. ఆనాడు బీజేపీ, టీడీపీ భాగ‌స్వామ్యాన్ని విజ‌య‌వంతంగా విడ‌దీయ‌గ‌లిగారు. అంతేకాదు, జ‌న‌సేన పార్టీని డ్యామేజ్ చేయ‌గ‌లిగారు. ప‌వ‌న్ వ్య‌క్తిత్వాన్ని పాతాళానికి తీసుకెళ్లారు. ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ర‌తిహ‌తంగా గెలిచారు. ఈసారి కూడా మైండ్ గేమ్ ఆడుతూ మ‌రో ఛాన్స్ కు ప‌దును పెడుతున్నారు. ఆ గేమ్ ను కుప్పం నుంచే మొద‌లు పెట్ట‌డం గ‌మ‌నార్హం.