Site icon HashtagU Telugu

CBN Kuppam : ల‌క్ష మోజార్టీకి రూట్ మ్యాప్, చంద్ర‌బాబు కుప్పం టూర్ జోష్

CBN target

Cbn Kuppam

వై నాట్ పులివెందుల టార్గెట్ గా చంద్ర‌బాబు (CBN Kuppam) అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, ల‌క్ష ఓట్ల మోజార్టీ ఇవ్వాల‌ని కోరుతూ కుప్పం వేదిక‌గా స‌రికొత్త స్లోగ‌న్ తీసుకున్నారు. మూడు రోజుల చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న శుక్ర‌వారం ముగిస్తుంది. ఈసారి ఆయ‌న శ్రేణుల‌తో మ‌మేకం అయ్యారు. గ‌తంలో గ్రామాల్లో రోడ్ షోల‌కు భిన్నంగా ఈసారి క్యాడ‌ర్ తో స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. ముఖాముఖి కొంద‌రితో మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌క్ష ఓట్ల మోజార్టీతో గెలిపించే బాధ్య‌తను క్యాడ‌ర్ మీద పెట్టారు.

వై నాట్ పులివెందుల టార్గెట్ గా చంద్ర‌బాబు (CBN Kuppam)

వై నాట్ 175 అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు కౌంట‌ర్ గా వై నాట్ పులివెందుల అంటూ చంద్ర‌బాబు(CBN Kuppam) ముందుకు క‌దిలారు. కుప్పం మీద వైసీపీ చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టారు. మున్సిప‌ల్ , స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ హ‌వా క‌నిపించింది. కానీ, సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేట‌ప్ప‌టికీ సీన్ మారిపోనుంది. ఆ దిశ‌గా శ్రేణుల‌ను చంద్ర‌బాబు ముందుకు క‌దుపుతున్నారు. మానసిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా వైసీపీ కుప్పంలోని టీడీపీ శ్రేణులు మీద ప‌లు ర‌కాల రాజ‌కీయ దాడులు చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు వాళ్ల‌లో ధైర్యాన్ని నింపుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల మీద క‌న్నేశారు. దీంతో చంద్ర‌బాబు వ్యూహం మీద టీడీపీ క్యాడ‌ర్ కు విశ్వాసం ఏర్ప‌డింది. సాధార‌ణ ఎన్నిక‌ల కోసం దూకుడుగా ప‌నిచేయ‌డానికి ముందుకొస్తున్నారు.

ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనే చంద్ర‌బాబు ఇంటి నిర్మాణంకు అనుమ‌తులు

ఇప్ప‌టి వ‌ర‌కు తిరుగులేని విధంగా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ కుటుంబం హ‌వా న‌డుస్తోంది. దానికి చెక్ పెట్టేలా ఇప్పుడు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌ను రంగంలోకి దించ‌డానికి టీడీపీ ప్ర‌యత్నం చేస్తోంది. అందుకే వై నాట్ పులివెందుల అనే నినాదాన్ని చంద్ర‌బాబు తీసుకున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయింది. తాజాగా లోకేష్ చేసిన యువ‌గ‌ళం పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో సూప‌ర్ హిట్ కావ‌డం టీడీపీకి జోష్ ను పెంచింది. రాయ‌ల‌సీమ వ్యాప్తంగా ఈసారి టీడీపీ హ‌వా కొన‌సాగ‌బోతుంద‌న్న సంకేతాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డంలో చంద్ర‌బాబు ఫ‌లప్ర‌దం అయ్యారు. ప్ర‌స్తుతం కుప్పం ప‌ర్య‌ట‌న మునుప‌టికి భిన్నంగా (CBN Kuppam) జ‌రిగింద‌ని శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది.

Also Read : CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ఇళ్లు కూడా లేకుండా చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని వైసీపీ విమ‌ర్శ‌లు కురిపించింది. దీంతో చంద్ర‌బాబు సొంత ఇంటి నిర్మాణానికి గ‌త ఏడాది శ్రీకారం చుట్టారు. అయితే, టౌన్ ప్లానింగ్ అనుమ‌తులు ఇవ్వ‌కుండా పెండింగ్ లో పెట్టారు. ఉద్దేశ పూర్వ‌కంగా నిర్మాణ ప‌నుల‌ను ఆపేశార‌ని టీడీపీ ఆరోపించింది. అంతేకాదు, భ‌వ‌న నిర్మాణకోసం కొనుగోలు చేసిన సిమెంట్ బ‌స్తాలు కూడా గ‌డ్డ‌క‌ట్టి పోయాయ‌ని మీడియాకు టీడీపీ నేత‌లు ఎక్కారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబునాయుడు (CBN Kuppam) రంగంలోకి దిగారు. ప్ర‌స్తుతం ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోన్న స‌మ‌యంలోనే చంద్ర‌బాబు ఇంటి నిర్మాణంకు అనుమ‌తులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో చంద్ర‌బాబు దెబ్బ‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిగొచ్చార‌ని శ్రేణుల్లో నూత‌నోత్సాహం నెల‌కొంది.

కుప్పంలో ఈసారి ల‌క్ష ఓట్ల మోజార్టీ వ‌చ్చేలా బ్లూ ప్రింట్

కుప్పం నియోక‌వ‌ర్గంలో ఈసారి ల‌క్ష ఓట్ల మోజార్టీ వ‌చ్చేలా బ్లూ ప్రింట్ ను చంద్ర‌బాబు (CBN Kuppam) త‌యారు చేశారు. దాన్ని అమ‌లు చేసే బాధ్య‌త‌ను ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు శాస‌న మండ‌లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ శ్రీకాంత్. కు అప్ప‌గించారు. ఆయ‌న‌తో పాటు ఎంపిక చేసిన యువ నాయ‌కుల‌ను రంగంలోకి దింపారు. దీంతో ఇప్ప‌టి కుప్పం మీద ప్ర‌త్యేకంగా క‌న్నేసిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్యూహాలు బెడిసికొట్టేలా ఉన్నాయి. కుప్పం చంద్ర‌బాబుకు కంచుకోట‌గా ఉంది. వ‌రుస‌గా ఆయ‌న గెలుస్తూ వ‌స్తున్నారు. ఈసారి ఆ కంచుకోట మీద వైసీపీ జెండా ఎగుర‌వేస్తాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్రామిస్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి.కానీ, ల‌క్ష ఓట్ల మెజార్టీ రావాల‌ని టార్గెట్ పెట్టిన చంద్ర‌బాబు ఆ దిశ‌గా టీడీపీ క్యాడ‌ర్ ను ఇప్ప‌టి నుంచే రంగంలోకి దింపారు. తాజాగా చంద్ర‌బాబు త‌యారు చేసిన బ్లూ ప్రింట్ తో వైసీపీ క్యాడ‌ర్ అయోమ‌యంలో ప‌డింద‌ని తెలుస్తోంది. మొత్తం మీద మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న ఈసారి చంద్ర‌బాబుకు(Chandrababu) ఫుల్ జోష్ తో పాటు క్యాడ‌ర్ కు నూత‌నోత్సాహాన్ని ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు