Site icon HashtagU Telugu

CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి

Jagan Script

Babu Jagan

CBN-Jagan : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఉమ్మ‌డి రాష్ట్రానికి 2020 విజ‌న్ ఇచ్చిన దార్శినికుడు. ఆయ‌న ఇచ్చిన విజ‌న్ ఫ‌లాల‌ను ఇప్పుడు తెలంగాణ స‌మాజం అనుభిస్తోంది. అలాగే, ఏపీకి కూడా 2029 అండ్‌ 2050 విజ‌న్ రూపొందించారు. దాన్ని ట్రాక్ లో పెట్ట‌డానికి సింగ‌పూర్ క‌న్సార్టియంతో ఒప్పందం చేసుకున్నారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న్ను ఓడించారు. సీన్ క‌ట్ చేస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యారు. విజ‌న్ మాట లేకుండా పోయింది. పైగా వేసిన విజ‌న్ పునాదులు నామ‌రూపాల్లేకుండా పోయాయి. మ‌ళ్లీ చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్ప‌టికీ విజ‌న్ సాకారం సాధ్య‌ప‌డ‌ద‌న్న స్థాయికి ఏపీ భ‌విష్య‌త్ ప‌డిపోయింది.

చంద్ర‌బాబును ఓడించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్వ‌శక్తులు (CBN-Jagan)

ఈసారి కూడా చంద్ర‌బాబును ఓడించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్వ‌శక్తులు ఒడ్డుతున్నారు. అందుకోసం చంద్ర‌బాబు వ్య‌క్తిత్వాన్ని, శారీర‌క నిర్మాణాన్ని, వ‌య‌సును కూడా వ‌ద‌ల్లేదు. ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి శీలాన్ని కూడా శంకించే స్థాయి వ‌ర‌కు రాజ‌కీయాన్ని ర‌చ్చ‌కెక్కించారు. తొలి రోజుల్లో ఆయ‌న ఒక సామాజిక‌వ‌ర్గానికి మాత్ర‌మే చేశాడ‌నే అప‌వాదు నెట్టారు. అందుకు ఆధారాల‌ను చూప‌లేక‌పోయారు. ఇప్ప‌టికీ అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ఆధారాల కోసం ఏపీ సీఐడీ మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. ఇక ఫైబ‌ర్ నెట్ అంటూ మ‌రో అప‌వాదు నెట్టారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు వ‌య‌స్సు మీద(CBN-Jagan) ఫోక‌స్ పెట్టారు.

Also Read : CBN P4 Formula :విజ‌న్ 2047కు చంద్ర‌బాబు పీ4 ఫార్ములా

సీఎం హోదాలో చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒకానొక సంద‌ర్భంలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న వ‌య‌సును ప‌దేప‌దే గుర్తు చేస్తూ ముస‌లోడు అయ్యాడ‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారు. వ‌య‌స్సు మీద ప‌డిన వాళ్లు రాష్ట్రానికి అవ‌స‌ర‌మా? అనే రీతిలో (CBN-Jagan)ప్ర‌చారం చేశారు. ఆ సమ‌యంలో చంద్ర‌బాబు తిరుప‌తి మెట్లు ఏక‌బిగిన ఎక్కిన వీడియో, ప్ర‌చార ర‌థంను సునాయాసంగా ఎక్కిన వీడియో, కాల్వ‌ల‌ను ఎగిరి దూకుతోన్న వీడియోల‌ను తెలుగుదేశం పార్టీ బ‌య‌ట‌కు తీసింది. వాటిని సోషల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ చేసింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా చంద్రబాబు మీద ఉప‌యోగించిన‌ ముస‌లాయ‌న అనే మాన‌సిక దాడి విఫ‌లం అయింది.

ఎల్లో మీడియా ప్ల‌స్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటూ చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ప‌ల్నాడు వేదిక‌గా చంద్ర‌బాబునాయుడు మీద మ‌రో ర‌కంగా రాజ‌కీయ‌దాడిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం ప్రారంభించారు. 40ఏళ్ల రాజ‌కీయాన్ని అవ‌లోకిస్తున్నారు. చంద్ర‌బాబు సీఎంగా చేసిన 14 ఏళ్ల‌లో ఏమి చేశారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. సొంత మ‌నుషుల‌కు మిన‌హా స‌మాజానికి ఏమీ చేయ‌లేద‌ని చెబుతున్నారు. ఇప్పుడు చివ‌రి ఛాన్స్ ఇస్తే చంద్ర‌బాబు ఏమి చేస్తారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా చేసిన ప‌నుల‌ను వివ‌రించ‌డానికి టీడీపీ టీమ్ ముందుకొచ్చింది. దుష్ట‌చ‌తుష్టయం అంటూ ఇటీవ‌ల ఎల్లో మీడియా ప్ల‌స్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటూ చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(CBN-Jagan) ఆ జాబితాలో బీజేపీని కూడా క‌లిపారు. అయితే, సున్నితంగా ఈసారి బీజేపీ అండ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ముక్తాయించడం ఆయ‌న వ్యూహంలోని కీల‌క ఘ‌ట్టం.

Also Read : Vijayawada TDP : కేశినేని 100శాతం పార్టీ మార్పు?

శారీర‌కంగా, మాన‌సికంగా చంద్ర‌బాబు మీద వైసీపీ నేత‌లు ప‌లుమార్లు(CBN-Jagan) రాజ‌కీయ దాడికి దిగారు. బొల్లి మ‌చ్చ‌ల కార‌ణంగా వ‌ర్షాలు ప‌డ‌వ‌ని మాన‌సిక దాడి చేస్తున్నారు. వెన్నుపోటు అంటూ ఆయన వ్య‌క్తిత్వాన్ని అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట ఏక‌పారేస్తున్నారు. సీనియార్టీని కూడా చూడ‌కుండా ఇష్టానుసారంగా వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఎవ‌రికైనా త‌ప్ప‌ని వ‌య‌స్సు మీద‌ప‌డ‌డాన్ని కూడా రాజ‌కీయ అస్త్రంగా ప్ర‌యోగిస్తున్నారు. ఇప్పుడు 40 ఏళ్ల‌లో ఏమీ చేయ‌లేద‌ని కొత్త స్లోగ‌న్ మొద‌లు పెట్టారు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి రాజ‌కీయ‌దాడిని చూడ‌ని చంద్ర‌బాబు మాత్రం సింహంలా గుర్జిస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్నారు. ఆయ‌న‌కు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. సమాజానికి ఏమీ చేయ‌ని చంద్ర‌బాబుకు(chandrababu) అంత‌మంది జ‌నం ఇప్ప‌టికీ ఎందుకు వ‌స్తున్నారు? అనే ప్ర‌శ్న వేసుకుంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌రైన స‌మాధానం దొరుకుతుంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

Also Read : CBN Politics : మ‌ళ్లీ పాత క‌థ‌! పరాయి వాళ్ల‌కు రెడ్ కార్పెట్!