Site icon HashtagU Telugu

CBN Hitech Publicity : LED వాహ‌నాల‌తో ప‌ల్లెకు చంద్ర‌బాబు ప్ర‌జెంటేష‌న్లు

Cbn Hitech Publicity

Cbn Hitech Publicity

విజన‌రీగా చంద్ర‌బాబుకు (CBN Hitech Publicity) ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ఈసారి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హైటెక్ ప‌ద్ద‌తిలో చేయాల‌ని భావిస్తున్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ మందికి మెసేజ్ చేరేలా సాంకేతికత‌ను స‌మ‌కూర్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజూ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంట్ ఇస్తోన్న అంశాల‌ను నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయ‌న చేసిన ప్ర‌జెంటేష‌న్ ప్ర‌తి ప‌ల్లెకు చేరేలా పీ4 ఎల్ ఈడీ డిస్ప్లే వాహ‌నాల‌ను పంప‌నున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హైటెక్ ప‌ద్ద‌తిలో చేయాల‌ని (CBN Hitech Publicity) 

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు ఉన్న ప్ర‌తి చోటకు పీ4 ఎల్ ఈడీ డిస్ల్పే వాహ‌నాల‌ను పంపాల‌ని బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ప‌ట్ట‌ణాల‌కు పీ4 ఎల్ ఈడీ ల‌ను , ప‌ల్లెల‌కు డిస్ల్పే బోర్డుల‌తో ఉన్న వాహ‌నాల‌ను పంప‌నున్నారు. ఎన్నిక‌ల వ‌ర‌కు నిరంత‌రం ఆ వాహ‌నాలు తిరుగుతూ చంద్ర‌బాబు  (CBN Hitech Publicity) ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఇలా ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న క‌లిగించాల‌ని చంద్ర‌బాబు హైటెక్ ప‌ద్ధ‌తిని అవ‌లంభించాల‌ని భావిస్తున్నార‌ట‌.

Also Read : CBN America Style : చంద్ర‌బాబు అమెరికా త‌ర‌హా ఎన్నిక‌ల ప్ర‌చారం

ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వం స‌భ‌లు, స‌మావేశాలు పెట్ట‌డానికి స‌వాల‌క్ష కండీష‌న్ల‌ను పెడుతోంది. అందుకే, ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..ప్రోగ్రామ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎక్క‌డ చంద్ర‌బాబు స‌భ‌లు పెట్టిన‌ప్ప‌టికీ జ‌నం కిక్కిరిసి పోతున్నారు. గుంటూరు, కందుకూరు ప్రాంతాల్లో జ‌రిగిన స‌భ‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగిన సంగ‌తి అందరికీ తెలిసిందే. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ జీవో నెం1ను తెర‌మీద‌కు తీసుకొచ్చింది. బ్రిటీష్ కాలంనాటి జీవోతో చంద్ర‌బాబు స‌భ‌ల‌ను అట్టుకుంది. ఆ త‌రువాత న్యాయ‌పోరాటం చేసి టీడీపీ గెలిచింది. అయిన‌ప్ప‌టికీ స‌భ‌ల‌ను గంద‌ర‌గోళం చేయ‌డానికి స్లీప‌ర్ సెల్స్ కొన్ని ప‌నిచేస్తున్నాయ‌ని చంద్ర‌బాబు గ్ర‌హించార‌ట‌. అందుకే, ఎల్ ఈడీ స్కీన్ల‌తో ప్ర‌చారం చేయ‌డానికి (CBN Hitech Publicity) సిద్దమ‌యిన‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2వేల వాహ‌నాల‌ను ఎల్ ఈడీ స్క్రీన్ల‌తో

గ‌త ఏడాది నుంచి మినీ మ‌హానాడుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు నిర్వ‌హించారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా చేశారు. ఆ త‌రువాత ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి ప్రోగ్రామ్ ను పెట్టారు. గ‌త 40ఏళ్లుగా చూస్తున్న చంద్ర‌బాబు ను మ‌రోసారి చూడ్డానికి జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఆయ‌న స్సీచ్ ను ఆసాంతం విన‌డానికి ఉత్సాహం చూపించారు. ప్ర‌జా స్పంద‌న గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏదోలా స‌భ‌ల‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని టీడీపీ భావించింది. అందుకే, రాబోవు ఎన్నిక‌ల్లో తక్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ప్ర‌చారం చేయ‌డానికి  (CBN Hitech Publicity) ఎల్ ఈడీ స్కీన్ల ను న‌మ్ముకుంది.

ఏపీ జీవ‌నాడిగా చెప్పుకునే పోల‌వ‌రం ప్రాజెక్టులోని అక్ర‌మాలు

రాష్ట్ర వ్యాప్తంగా 2వేల వాహ‌నాల‌ను ఎల్ ఈడీ స్క్రీన్ల‌తో తిప్పాల‌ని యోచిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజూ ఒక అంశం మీద చంద్ర‌బాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తున్నారు. వాటిని మ‌రువ‌కుండా ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న క‌లిగించాలంటే ఎల్ ఈడీ స్క్రీన్ల ప్ర‌ద‌ర్శ‌న (CBN Hitech Publicity) స‌రైన మార్గ‌మ‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రాయ‌సీమ ద్రోహి జ‌గ‌న్ అంటూ ఒక ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేశారు. రెండో రోజు కోస్తా ఆంధ్రా ప్రాజెక్టుల‌పై అంకెల‌తో స‌హా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నీటి ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసిన వైనాన్ని వివ‌రించారు. ఇక ఏపీ జీవ‌నాడిగా చెప్పుకునే పోల‌వ‌రం ప్రాజెక్టులోని అక్ర‌మాలు, దుర్మార్గాల‌ను పోల‌వ‌రానికి ప‌ట్టిన శ‌ని జ‌గ‌న్ అనే టైటిల్ తో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఇలాంటి ప్ర‌జెంటేష‌న్ల‌ను ప్ర‌తి రంగంపై చంద్ర‌బాబు ఇవ్వ‌నున్నారు. వీటినే ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకోవాల‌ని టీడీపీ భారీ ప్లాన్ చేసింది.

Also Read : CBN Facts : అన్న‌దాత కోసం చంద్ర‌బాబు!దాస్తే దాగ‌ని స‌త్యాలివి!