Site icon HashtagU Telugu

CBN Happy : చంద్ర‌బాబుకు మ‌మ‌త వ్యాఖ్య‌ల‌ జోష్

Cbn Happy

Cbn Happy

బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ లోక్ స‌భ ఎన్నిక‌ల గురించి చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో (CBN Happy) జోష్ నింపుతున్నాయి. రాబోయే రోజుల్లో లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు క‌లిసి వ‌స్తే బీజేపీ దోస్త్ సానుకూలంగా ఉంటుంద‌ని భావిస్తోంది. అంతేకాదు, డిసెంబ‌ర్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు జ‌రిగే అవ‌కాశం ఉందని టాక్‌. అదే జరిగితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ కు కూడా ముడిన‌ట్టేన‌ని ప్ర‌చారం మొద‌ల‌యింది.

మ‌మ‌త బెన‌ర్జీ   వ్యాఖ్య‌లు టీడీపీలో జోష్ (CBN Happy) 

డిసెంబర్లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు మోడీ వెళుతున్నార‌ని బెంగాల్ టైగ‌ర్ బాంబ్ పేల్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం బీజేపీ నాయ‌కులు దేశంలోని హెలికాప్ట‌ర్ల‌ను బుక్ చేసుకున్నార‌ని ఆధారం చూపుతున్నారు. అంటే, ప‌క్కా స‌మాచారంతోనే దీదీ ఆ కామెంట్ల చేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. చాలా కాలంగా ముంద‌స్తు మాట వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో జ‌మిలి ఎన్నిక‌ల గురించి చ‌ర్చ జ‌రిగింది. ఆ దిశ‌గా మోడీ కూడా ఒక‌టిరెండు సంద‌ర్భాల్లో మీటింగ్ లు పెట్టారు. కానీ, దేశంలోని ప‌రిస్థితుల దృష్ట్యా జ‌మిలి ఎన్నిక‌లు సాధ్యంకాద‌ని తాత్కాలికంగా నిమ్మ‌కున్నారు. కానీ, దేశం వ్యాప్తంగా త్వ‌ర‌లో జ‌రిగే మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్ గ‌ఢ్‌, మిజోరాం, తెలంగాణ‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు ఉంటాయ‌ని తాజాగా చ‌ర్చ న‌డుస్తోంది.

Also Read : Delhi CEC : TDP, YCPప‌ర‌స్ప‌ర ఫిర్యాదు!YCP ర‌ద్దుకు CBN డిమాండ్!!

ఐదు రాష్ట్రాల‌కు డిసెంబ‌ర్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలి. జ‌న‌వ‌రి నాటికి కొత్త ప్ర‌భుత్వాల‌ను అక్క‌డ ఏర్పాటు చేయాలి. అందుకే, ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా ఏర్పాట్ల‌ను చేస్తోంది. కానీ, ఆ ఐదు రాష్ట్రాల‌తో మ‌రిన్నింటిని క‌లుపుకుని లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేంద్రంలోని ఎన్డీయే యోచిస్తోంద‌ని మ‌మ‌త వ్యాఖ్య‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. దేశ వ్యాప్తంగా పాక్షిత జ‌మిలి ఎన్నిక‌లనైనా నిర్వ‌హించ‌డానికి సానుకూల ప‌రిస్థితుల‌ను తీసుకురావాల‌ని మోడీ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని స‌మాచారం. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా డిసెంబ‌ర్లోనే నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్టు వినికిడి.

ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నార‌ని

ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం ప్ర‌ధాని నరేంద్ర‌మోడీని ఇప్ప‌టికే ప‌లుమార్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లిశారు. ఆ విష‌యం తాడేప‌ల్లి వ‌ర్గాల ద్వారా ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒక వైపు ముంద‌స్తు లేదంటూనే ఎన్నిక‌ల ప్ర‌చారానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు బ‌ట‌న్ నొక్కే ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల స‌భ మాదిరిగా వాడుకుంటున్నారు. అమ్మ‌వ‌డి, విద్యాదీవెన త‌దిత‌ర విద్యార్థుల‌కు సంబంధించిన ప్రోగ్రామ్ ల‌లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు, చంద్ర‌బాబు పాల‌న, దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అంటే, ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు.

ఒకేసారి రెండు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల‌కు జ‌రిగితే కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల‌కు

ఒక వేళ మ‌మ‌త అంచ‌నా ప్ర‌కారం ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే, చంద్ర‌బాబుకు అద‌న‌పు లాభం క‌లుగుతుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే, బీజేపీతో పొత్తు క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. జాతీయ స్థాయిలో చూసిన‌ప్పుడు మోడీ స‌ర్కార్ కు అనుకూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అదే, రాష్ట్ర స్థాయిలో బీజేపీకి వ్య‌తిరేక‌త ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ మునిగిపోయే అవ‌కాశం ఉంది. కానీ, లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు క‌లిసి ఒకేసారి వ‌స్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. పైగా బీజేపీతో పొత్తు అంశం దాదాపుగా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. ఆ క్ర‌మంలో మైనార్టీ ఓట‌ర్లు దూరం అవుతార‌ని టీడీపీ ఆలోచిస్తోంది. జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఏపీలో వస్తే మాత్రం లాభం లేకున్నా బీజేపీ రూపంలో న‌ష్టం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తోంది.

బెంగాల్ సీఎం మ‌మ‌త పేల్చిన బాంబ్ తో ప్ర‌త్య‌ర్థులు అల‌ర్ట్

తెలంగాణ‌తో పాటు ఏపీ ఎన్నిక‌ల‌కు కూడా ఉంటాయ‌ని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్య రాజ‌కీయ అవ‌గాహ‌న బాగా ఉంది. ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం ఉంది. పైగా ఎంఐఎం కూడా ఇద్ద‌రికీ స‌హ‌జ మిత్రునిగా ఉన్నారు. ఒకేసారి రెండు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల‌కు జ‌రిగితే కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల‌కు సానుకూల ఫ‌లితాలు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏపీలో ఉండే సామాన్యులు సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా వైసీపీ వైపు ఉన్నార‌ని ఆ పార్టీ భావిస్తోంది. అదే, వ‌ల‌స వెళ్లిన వాళ్లు ఏపీ అభివృద్ధి లేద‌నే భావ‌న‌తో ఉన్నార‌ని వైసీపీ గ్ర‌హించింది. అందుకే, వ‌ల‌స ఓట‌ర్ల‌ను ఆప‌డానికి తెలంగాణ ఎన్నిక‌ల‌ను కూడా అదే స‌మ‌యంలో ఉండేలా చేయ‌డం ఒక వ్యూహం.

Also Read : TDP Poll Management : కుటుంబ సార‌థులు వ‌చ్చేస్తున్నారు.!కాస్కోండిక‌!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెటిల‌ర్లు అనుకూలంగా ఉన్నార‌ని గ్రేట‌ర్ ఎన్నిక‌ల ద్వారా బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఒకేసారి ఇరు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే ఇద్ద‌రు సీఎంల‌కు మేలు అనే భావ‌న‌తో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.
అందుకే, తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌లు ఒకేసారి ఉంటాయ‌ని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు కూడా వాటితో పాటు వ‌స్తే ఫ‌లితాలు మ‌రోలా ఉండే అవ‌కాశం ఉంది. మొత్తం మీద బీజేపీ ఎత్తుగ‌డ ఏమిటి? అనేది మాత్రం ఇతిమిద్ధంగా తెలియ‌డంలేదు. బెంగాల్ సీఎం మ‌మ‌త పేల్చిన బాంబ్ తో ప్ర‌త్య‌ర్థులు అల‌ర్ట్ అయ్యారు. క‌మ‌ల‌నాథుల‌తో పొత్తు కోరుకుంటోన్న చంద్ర‌బాబు అండ్ టీమ్ మాత్రం జోష్ తో ఉంది.