అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను సంతోష పెడుతుంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ (YCP) పాలనా లో విసుగు చెందిన ప్రజలు..ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) పాలనలో సంబరాలు చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..రాష్ట్ర అభివృద్ధి ఫై బాబు ఫోకస్ పెట్టాడు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా పేదల ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల పంపిణీలో చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేసింది. అయితే లే అవుట్లు వేయని చోట కూడా ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
అలాగే జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు అందజేయాలని సీఎం నిర్ణయించారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సెంటు స్థలం పంపిణీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించింది. అయితే సెంటు స్థలంలో ఇళ్లు అగ్గిపెట్టెల్లా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు కనీసం రెండు సెంట్ల స్థలం అయినా పంపిణీ చేయాలని అప్పట్లో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు అడుగులు వేస్తోంది. అలాగే ఆగస్ట్ రెండో తేదీన ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాకులో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం చర్చించనుంది.
Read Also : Telangana Panchayat Elections : 33 జిల్లాల కలెక్టర్లకు CS కీలక ఆదేశం..!