CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

ఓట‌ర్ల జాబితాలకు సాంకేతిక‌(CBN Giotag)ను జోడిస్తూ ఓట‌ర్ల‌ను కాపాడుకునే వ్యూహాన్ని చంద్ర‌బాబు ర‌చించారు.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 05:04 PM IST

విజ‌యం సాధించ‌డానికి అభ్య‌ర్థుల ఎంపిక‌, ప్ర‌చారం, ఎల‌క్ష‌నీరింగ్ ఈ మూడు అంశాలు ప్ర‌ధానం. వాటిలో ఏ ఒక్క దానిలో వెనుక‌బ‌డ్డా గెలుపు అందుకోవ‌డం క‌ష్టం. ఆ విష‌యాన్ని బాగా తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యాన్ని అందుకున్నారు. ఈసారి వాటికి మ‌రింత ప‌దును పెడుతూ వాలంటీర్లు, వాళ్ల‌కు స‌మాంత‌రంగా పొలిటిక‌ల్ వాటంటీర్ల‌ను సిద్ధం చేశారు. వాళ్ల ద్వారా ఇప్ప‌టికే ఓట‌ర్ల జాబితాలోని టీడీపీ సానుకూల ఓట‌ర్ల పేర్ల‌ను తొల‌గించారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఓట‌ర్ల జాబితాలకు సాంకేతిక‌(CBN Giotag)ను జోడిస్తూ సానుభూతి ఓట‌ర్ల‌ను(Voters) కాపాడుకునే వ్యూహాన్ని చంద్ర‌బాబు ర‌చించారు. ఆ క్ర‌మంలో జియో ట్యాంగింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు.

ఓట‌ర్ల జాబితాలకు సాంకేతిక‌(CBN Giotag)

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపీలోని ఓటర్ల(Voters) జాబితా సిద్ధం చేసింది. దానిపై తొలుత టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. మొత్తం 175 నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ ఇన్ఛార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ జాబితాలను అందించింది. వాటిని ప‌రిశీలన చేసే బాధ్య‌త‌ను అప్ప‌గించింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించి వీలున్నంత వేగంగా ముగించాల‌ని ఆదేశించింది. ఫ‌లితంగా ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేస్తున్నారు. మండలాలవారీగా జాబితాలను పరిశీలించడానికి రంగంలోకి దిగారు. కుప్పంలో ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించడంతో పాటు ఓటర్ల జాబితాను జియో ట్యాగింగ్ (CBN Giotag)చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని న‌మూనాగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఆ విధంగా చేయాల‌ని టీడీపీ జాగ్ర‌త్త‌ప‌డుతోంది.

Also Read : CBN : YCP సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు రావాల‌ని TDP ఇంచార్జిల గాంధీయమార్గం.!

సానుకూల ఓట‌ర్ల‌ను జాబితా ఆధారంగా జియో ట్యాగ్ చేస్తారు. తద్వారా జాబితాలో ఎక్కడైనా పేర్లు నమోదు కాకపోయినా, తొలగించినా వెంటనే ఓట‌రును అప్ర‌మ‌త్తం చేసేలా టీడీసీ సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస‌క్తోంది. ఓటును తొల‌గిస్తే వెంట‌నే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవ‌గాహ‌న క‌లిగించే బాధ్య‌త‌ను కార్య‌క‌ర్త‌ల‌కు అప్ప‌గించింది. ఇప్ప‌టికే వైసీపీ అనుకూల ఓటుబ్యాంకు పెరిగేలా వ్యూహాత్మకంగా ఓటర్ల జాబితాను త‌యారు చేసిన‌ట్టు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుర్తించారు. సుమారు 7వేల ఓట్ల‌ను ఉర‌వ‌కొండ‌లో తొల‌గించిన‌ట్టు క‌నుగొన్నారు. మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా త‌న నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించుకున్నారు. దీనిద్వారా ఎన్ని ఓట్లున్నాయి? ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? అనే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం

మాజీ మంత్రి ఉమ చెబుతోన్న ప్ర‌కారం సానుభూతిపరులుగా గుర్తించి సుమారు 25వేల మందిని జాబితా నుంచి తొల‌గించారు. ఆ మేర‌కు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఇలాగే చేసిందని ఆ ఫిర్యాదులో ఉమ పేర్కొన్నారు. మరణించినవారి ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఒకే పేరుతో ఉన్న ఓటర్లు ఎంత మంది ఉన్నారు? వారు ఏ పార్టీకి అనుకూలం? తదితర విషయాలను తెలుగుదేశం పార్టీ తన సర్వేలో సేకరించ‌నుంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ప‌నిచేస్తోంది. వీలున్నంత త్వ‌ర‌గా ఎన్ని ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాలంటీర్లు తొలగించారో తేల్చ‌నుంది.

Also Read : CBN Power : అధికార మార్పుపై అంచ‌నా, చంద్ర‌బాబుతో IAS,IPSల ర‌హ‌స్య‌ భేటీ

ప్ర‌స్తుతం అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఒక క్లారిటీకి చంద్ర‌బాబు వ‌చ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మిన‌హా మిగిలిన చోట్ల అభ్యర్థుల‌ను తేల్చేశారు. ఇప్ప‌టికే సంకేతాలు ఆ మేర‌కు వెళ్ల‌గా, కొంద‌రి గ్రాఫ్ ను ప‌రిశీలిస్తున్నారు. చివ‌రి నిమిషంలో కొంద‌ర్ని మార్చేందుకు అవ‌కాశం లేక‌పోలేదు. ఇలా అభ్య‌ర్థుల విష‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన చంద్ర‌బాబు రాబోవు రోజుల్లో ప్ర‌చారానికి ప‌దును పెడుతున్నారు. అదే స‌మ‌యంలో పోలింగ్ రోజు ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను ఇప్ప‌టి నుంచే చ‌క్క‌దిద్దే ఆలోచ‌న చేస్తున్నారు. ఓట‌ర్ల జాబితాలోని సానుకూల‌, త‌ట‌స్థ ఓట‌ర్ల ను జియో ట్యాగింగ్ చేయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌ల్లోని మూడు అంశాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డం ద్వారా అధికారంలోకి రావాల‌ని క‌సిగా చంద్ర‌బాబు ప‌నిచేస్తున్నారు.