CBN : YCP సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు రావాల‌ని TDP ఇంచార్జిల గాంధీయమార్గం.!

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టిక్కెట్ల ఇవ్వాల‌ని టీడీపీ(CBN)

  • Written By:
  • Updated On - January 31, 2023 / 01:20 PM IST

గాంధీయ మార్గం ఏపీ రాజ‌కీయాల్లోకి వ‌స్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టిక్కెట్ల ఇవ్వాల‌ని టీడీపీ(CBN) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు మ‌న‌సావాచాక‌ర్మ‌ణా కోరుకుంటున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. టీడీపీలోకి వాళ్లంద‌రూ వ‌స్తార‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే 30 చోట్ల త్యాగాల‌కు సిద్ద‌మైన టీడీపీ ఇంచార్జిలు వైసీపీ(YCP)సిట్టింగ్ లు కూడా టీడీపీ వైపు వ‌స్తే ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న వేసుకుంటూ హైరానా ప‌డుతున్నారు.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టిక్కెట్ల ఇవ్వాల‌ని టీడీపీ (CBN)

రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లోనూ సుమారు 30 మంది లీడ‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు పార్టీని కాపాడుకుంటూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌కు ప‌నిచేసిన వాళ్ల‌ను త్యాగం చేయాల‌ని చెబుతూ ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు చంద్ర‌బాబు(CBN) టిక్కెట్లు ఇచ్చారు. అంతేకాదు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను తీసుకుని వాళ్ల‌లో కొంద‌రికి మంత్రులుగా స్థానం క‌ల్పించారు. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తోన్న సొంత పార్టీలోని లీడ‌ర్లు గాంధీమార్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేల‌కు టిక్కె ట్లు ఇచ్చే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP) మ‌న‌సు ఉండాల‌ని రావాల‌ని దేవుళ్ల‌ను కోరుకుంటున్నార‌ట‌.

Also Read : Jagan-CBN : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఫ‌ల్యాలే చంద్ర‌బాబు విజ‌యానికి మెట్లు

సుమారు 50 మంది సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల సంకేతాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో స‌మీక్ష చేసిన ఆయ‌న ఆ మేర‌కు సంకేతాలు ఇచ్చార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఇచ్చిన ఇండియా టుడే సీ -ఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. ఈసారి అధికారంలోకి రావడం క‌ష్టంగా ఆ స‌ర్వే సారాంశం. మంత్రులు స‌గానికి పైగా గెల‌వ‌ర‌ని ఆ స‌ర్వే చెబుతోంది. అంతేకాదు, 70 మంది ఎమ్మెల్యేలు ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నార‌ని స‌ర్వేలోని ప్ర‌ధాన అంశంగా ఉంది. అందుకే, ఈసారి సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌డానికి బ‌దులుగా కొత్త వాళ్ల‌ను ఇంచార్జిల‌ను కొన్ని చోట్ల నియ‌మించ‌డం ప్రారంభించారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

టిక్కెట్ ఇవ్వ‌లేమని సంకేతాలు అందుకున్న వాళ్లంద‌రూ టీడీపీ వైపు

ఏపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న ను విమ‌ర్శిస్తూ కొంద‌రు ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాళ్ల‌లో ప్ర‌ధానంగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటమ‌రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి క‌నిపిస్తున్నారు. వాళ్ల జాబితాలో ఇంకా చాలా మంది ఉన్న‌ట్టు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వ‌లేమని సంకేతాలు అందుకున్న వాళ్లంద‌రూ టీడీపీ వైపు చూస్తున్నారు. లేదంటే జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సొంత పార్టీ వాళ్ల‌ను త్యాగాల‌కు సిద్దం కావాల‌ని చంద్ర‌బాబు పిలుపు నివ్వ‌డం నికార్సైన టీడీపీ లీడ‌ర్ల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. అందుకే, అటు అధిష్టానాన్ని ఎదిరించ‌లేక‌, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వాళ్ల‌ను కాద‌న‌లేక దేవుని ప్రార్థిస్తూ గాంధేయ మార్గంలో వైసీపీ సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు రావాల‌ని కోరుకుంటున్నారు. ఆ విష‌యాన్ని టీడీపీలోని ఒక సీనియర్ నేత వెలిబుచ్చారు.

Also Read : CBN Power : అధికార మార్పుపై అంచ‌నా, చంద్ర‌బాబుతో IAS,IPSల ర‌హ‌స్య‌ భేటీ