Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు

రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 09:32 PM IST

తనను సీఎం జగన్ (Jagan) పశుపతి అంటున్నారని.. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడిన శివుడని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. తాను రాష్ట్రాన్ని కాపాడడానికే శివుడి అవతారం ఎత్తానని’ చెప్పుకొచ్చారు. ప్రజాగళం (Prajagalam) యాత్రలో భాగంగా కోనసీమ జిల్లా కొత్తపేట (Kothapeta) లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ..జగన్ ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలు జట్టుగా వచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదే, వందకు వంద శాతం టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను సీఎం జగన్ పశుపతి అంటున్నారని.. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడిన శివుడని, తాను రాష్ట్రాన్ని కాపాడడానికే శివుడి అవతారం ఎత్తానని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే తాను వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటీర్లు రాజకీయం చేయడానికి మాత్రమే వ్యతిరేకమని , వాలంటీర్లు తటస్థంగా ఉండాలని, వారికి తాను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ తన సంపద కోసం నాణ్యత లేని మద్యాన్ని తయారు చేయిస్తున్నారని, ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? అంటూ ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను గంజాయి కేంద్రంగా మార్చారని, ఇటీవలే విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్‌ పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం విక్రయించేందుకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రైతులు ఏపీలో ఉన్నారని, వైసీపీ హయాంలో రైతు చితికిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

Read Also : KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..