CBN Fight : ఢిల్లీ వ‌ర‌కు చంద్ర‌బాబు పోరుబాట

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌డానికి (CBN Fight)బాబు సిద్ద‌ప‌డ్డారు. కేంద్రంతో పోరాటం మేల‌నే అభిప్రాయానికి వ‌చ్చారు.

  • Written By:
  • Updated On - July 12, 2023 / 03:16 PM IST

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌డానికి (CBN Fight)చంద్ర‌బాబు సిద్ద‌ప‌డ్డారు. కేంద్రంతో క‌లిసి పనిచేయ‌డం కంటే పోరాటం మేల‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. బీజేపీతో పొత్తు కంటే రాష్ట్ర కోసం పోరాటం చేయ‌డానికి నిర్ణ‌యించారు. రాష్ట్రంలో తొలగించిన ఓట్ల మీద ఉద్య‌మించ‌డానికి ఢిల్లీ వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ పొత్తు గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ఏపీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు ఒంటరి పోరుకు  సిద్ద‌మ‌వుతున్నార‌ని(CBN Fight)

ఏపీలో పొత్తుల అంశం చాలా కాలంగా న‌డుస్తోంది. ఇటీవ‌ల బీజేపీ ఏపీ చీఫ్ గా పురంధ‌రేశ్వ‌రిని నియ‌మించిన త‌రువాత బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల ఆలోచ‌న అర్థ‌మ‌యింది. అందుకే, ద‌గా ప‌డ్డ రాష్ట్రం కోసం పోరాటాన్ని మాత్ర‌మే ఎంచుకున్న‌ట్టు (CBN Fight)చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మీడియా చిట్ చాట్ లో బుధ‌వారం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పొత్తును లైట్ గా తీసుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన త‌రువాత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటించారు. గ‌త రెండు వారాలుగా సైలెంట్ గా ఉన్న ఆయ‌న బుధ‌వారం మీడియాతో చిట్ చాట్ కు రావ‌డం రాజ‌కీయ ప‌రిణామాల‌ను తెలియ‌చేస్తోంది.

తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం ద్వారా బీజేపీని బ‌లోపేతం

జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా సంచ‌ల‌న‌, వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌ను చేస్తూ వారాహి యాత్ర‌ను ముందుకు తీసుకెళుతున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల రూట్ మ్యాప్ ప్ర‌కారం ఆయ‌న న‌డుచుకుంటున్నారు. ఆ క్ర‌మంలో తొలి రోజుల్లో సీఎం రేస్ లో లేనంటూ ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఇప్పుడు సీఎం ప‌ద‌వి ఇస్తే సంతోషంగా తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. రాజ్యాధికారం ల‌క్ష్యంగా జ‌న‌సేన ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండని వేడుకుంటున్నారు. సీఎం కుర్చీలో కూర్చోబెట్టండ‌ని ప్రాథేయ‌ప‌డుతున్నారు. ఆయ‌న మాట‌ల‌ను గ‌మ‌నిస్తే బీజేపీ పెద్ద‌ల రూట్ త‌ప్ప‌కుండా అనుస‌రిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

 వేల టీడీపీ ఓట‌ర్ల‌ను తొల‌గించ‌డానికి వైసీపీ స్కెచ్

పొత్తు విష‌యంలో గౌర‌వ ప్ర‌దంగా ఉంటుంద‌ని గ‌తంలో ప‌వ‌న్ అన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. మూడునాలుగు సార్లు చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ఇంకేముంది టీడీపీ, జ‌న‌సేన పొత్తు అనుకున్నారు. అంతేకాదు, బీజేపీని కూడా క‌లుపుకుని కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల‌కు మూడు పార్టీలు వెళ‌తాయ‌ని భావించారు. కానీ, ప‌వ‌న్ తాజాగా సీఎం ప‌ద‌విని కోరుకోవ‌డం, బీజేపీ ఏపీ చీఫ్ గా పురంధ‌రేశ్వ‌రిని నియ‌మించ‌డం చంద్ర‌బాబుకు అంతుబ‌ట్ట‌కుండా ఉంది. తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం ద్వారా బీజేపీని బ‌లోపేతం చేసుకోవాల‌ని బీజేపీ పెద్ద‌లు పావులు క‌దిపారు. దాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఒంటరి పోరుకు  (CBN Fight)సిద్ద‌మ‌వుతున్నార‌ని తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ఆధారంగా బోధ‌ప‌డుతోంది.

Also Read : CBN P4 Formula : `పూర్ టూ రిచ్ `తో   ఆర్థిక విప్ల‌వం

వ‌లంటీర్ల విష‌యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై గత నాలుగు రోజులు ఏపీ వ్యాప్తంగా రాజ‌కీయం వేడెక్కింది. రాజ‌కీయాల్లోకి వ‌లంటీర్లు రాకూడ‌ద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ప్ర‌జాసేవ కోసం నియ‌మించిన వాళ్ల‌ను ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లోకి తీసుకురావ‌డం కుద‌ర‌దు. ఇదే విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు రూపంలో టీడీపీ తెలియ‌చేసింది. అయిన‌ప్ప‌టికీ పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని వ‌లంటీర్లు సేక‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొన్ని వేల టీడీపీ ఓట‌ర్ల‌ను తొల‌గించ‌డానికి వైసీపీ స్కెచ్ వేసింది. దానిపై పోరాటానికి సిద్ద‌ప‌డుతూ ద‌గా ప‌డ్డ ఏపీని కాపాడుకోవ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చంద్ర‌బాబు తాజాగా ప్ర‌క‌టించారు. పొత్తుల కంటే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మ‌ని నిన‌దించ‌డాన్ని చూస్తుంటే ఒంటరి పోరుకు టీడీపీ సిద్ద‌మ‌యింద‌ని అర్థ‌మ‌వుతోంది.

Also Read : CBN Vision 2024 : ఒకేసారి TDP అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?