CBN Facts : అన్న‌దాత కోసం చంద్ర‌బాబు!దాస్తే దాగ‌ని స‌త్యాలివి!

`మ‌రో ఛాన్స్ ` కోసం ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌ను (CBN Facts) దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం కొన్ని రోజులు చేసింది.

  • Written By:
  • Updated On - July 26, 2023 / 01:43 PM IST

`మ‌రో ఛాన్స్ ` కోసం వైసీపీ ప‌లు ర‌కాల జిమ్మిక్కులు చేస్తోంది. ప్ర‌తిప‌క్ష‌నేత‌ చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌ను (CBN Facts) దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం కొన్ని రోజులు చేసింది. ఆ త‌రువాత ఆయ‌న‌ వ‌య‌స్సు ను మ‌రికొన్ని రోజులు హైలెట్ చేసింది. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌స్తే `వ‌ర్షాలు ప‌డ‌వు, పంటలు పండవ్` అంటూ ఆ పార్టీ మంత్రులు స్లోగ‌న్ అందుకున్నారు. సాక్షాత్తు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ప‌దేప‌దే ఈ సెంటిమెంట్ ను రంగరిస్తున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా బ‌హిరంగ స‌భ‌ల్లో ఇలాంటి చౌక‌బారు కామెంట్లు చేస్తున్నారు. విధాన‌ప‌ర‌మైన అంశాల‌పై ప్ర‌జ‌లు చ‌ర్చించుకునే అవ‌కాశం లేకుండా వ్య‌క్తిత్వ హ‌న‌నం, శారీర‌క నిర్మాణం, లోపాల‌ను ఎన్నిక‌ల ప్ర‌చార అస్త్రాలుగా ఎంచుకోవ‌డం దారుణం.

చంద్ర‌బాబు వ‌స్తే `వ‌ర్షాలు ప‌డ‌వు, పంటలు పండవ్` (CBN Facts)

ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు సీఎంగా 1995 నుంచి 2004 వ‌ర‌కు ఉన్నారు. ఆ టైమ్ లో ఏడేళ్లు క‌రువు (CBN Facts) తాండ‌వించింది. కేవ‌లం ఏపీలో మాత్ర‌మే కాదు, దేశ వ్యాప్తంగా క‌రువు ప‌రిస్థితులు అప్పుడు ఉండేవి. అ స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి శ్ర‌మ‌దానం, పనికి ఆహార ప‌థకం వంటి స్కీమ్ ల‌ను చంద్ర‌బాబు తీసుకొచ్చారు. కేంద్రం నుంచి భారీగా నిధుల‌ను తీసుకురావ‌డం ద్వారా క‌రువు రోజుల్లోనూ ప‌నిక‌ల్పించారు. ఆ రోజుల్లో మంచినీళ్లు కూడా లేని ప‌రిస్థితి ఉండేది. నీటి నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం ద్వారా మంచినీళ్లను స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లిగారు. అలాంటి క‌రువు ప‌రిస్థితులు ఇప్పుడు ఉంటే, ఎలా ఉండేదో ఊహించుకోవ‌చ్చు.

శ్ర‌మ‌దానం, పనికి ఆహార ప‌థకం వంటి స్కీమ్ ల‌ను చంద్ర‌బాబు

ఏపీ విభ‌జ‌న త‌రువాత తొలి సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రానికి క‌నీస వ‌న‌రులు ఉండేవి కాదు. రాజ‌ధానిలేని రాష్ట్రానికి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తొలి రోజు నుంచే ఏపీని గాడిలో పెట్ట‌డానికి చంద్ర‌బాబు (CBN Facts) ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అధికారులు కొంద‌రు స‌హ‌కారం అందించ‌లేదు. దానితో పాటు స‌మ‌కాలీన రాజ‌కీయాల్లోనూ చంద్ర‌బాబు వెనుక‌బ‌డ్డారు. ప‌లు ఒడిదుడుకుల్లోనూ ఏపీ ప్ర‌గ‌తిని ప‌రుగు పెట్టించారు. రాజధాని నిర్మాణం శంకుస్థాప‌న జ‌రిగిన తీరును గుర్తు చేసుకుంటే, ఆయ‌న విజ‌న్ అర్థ‌మ‌వుతోంది. ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన్ని వేల కోట్ల పెట్టుబ‌డులు రాబ‌ట్టే ఒప్పందాల‌ను చేసుకున్నారు. అదే స‌మ‌యంలో వ్య‌వ‌సాయ రంగాన్ని ప‌రుగులు పెట్టించారు.

చంద్ర‌బాబు హ‌యాంలో వ్య‌వ‌సాయ రంగం 11 శాతం వృద్ధి రేటు

ఏపీ రాష్ట్రానికి 2014 నుంచి 2019 వ‌ర‌కు తొలి సీఎంగా చంద్ర‌బాబు ప‌నిచేశారు. ఆయ‌న హ‌యాంలో వ్య‌వ‌సాయ రంగం 11 శాతం వృద్ధి రేటును సాధించింది. ఆ రంగం ఇప్పుడు 4.16 శాతం వృద్ధి రేటుకు ప‌డిపోయింది. అంతేకాదు, రాష్ట్రంలో 2019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ట్టు ప్ర‌తిప‌క్షాల అంచనా. కానీ, ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం 672 మంది రైతులు ఆత్మ‌హ‌త్య కు పాల్ప‌డ్డార‌ని చెబుతోంది. అందుకుగాను, రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల‌కు 42కోట్ల రూపాయాలు ఆర్థిక స‌హాయం అంద‌చేసిన‌ట్టు ప్ర‌భుత్వం వివ‌రిస్తోంది. వాస్త‌వంగా 3వేల వ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని చెబుతోన్న విప‌క్షాలు రూ. 250 కోట్ల వ‌ర‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించాల‌ని లెక్కిస్తోంది. ఇప్పుడున్న ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయాన్ని అందించాల్సి వ‌స్తుంద‌ని రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను (CBN Facts)దాచేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు.

Also Read : CBN P4 Vision : చంద్ర‌బాబు మాట‌వింటే.!అంద‌రూ కోటీశ్వ‌రులే.!!

అధికారిక రికార్డుల ప్ర‌కారం చంద్ర‌బాబు సీఎంగా ఉన్న హ‌యాంలో వ్య‌వ‌సాయ‌రంగం వృద్ధి రేటు అధికంగా ఉంది. ప్ర‌స్తుతం అధికార పార్టీ మంత్రులు, లీడ‌ర్లు చెబుతున్న ప్ర‌కారం చంద్ర‌బాబు సీఎంగా ఉంటే `క‌ర‌వు, పంట‌లు పండ‌వ్` అనే సెంటిమెంట్ నిజ‌మైతే అధికార వృద్ధి రేటు ఎలా సాధ్య‌మో? వాళ్లే చెప్పారు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో కేవ‌లం 4.16శాతం మాత్ర‌మే వ్య‌వ‌సాయ రంగం వృద్ధి రేటు ఉంది. అంటే, చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌కృతి సంహ‌క‌రించిందా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ప్పుడు స‌హ‌క‌రించిందా? అనేది ఆలోచించాలి. వ‌ర్షాలు స‌మృద్ధిగా స‌కాలంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ప‌డ్డాయ‌ని గ్రోత్ రేట్  (CBN Facts) చెబుతోంది. ఇప్పుడున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టైమ్ లో స‌మృద్ధిగా వ‌ర్షాలు ప‌డుతున్న‌ప్ప‌టికీ అకాలంలో ప‌డుతున్నాయ‌ని త‌గ్గిన గ్రోత్ రేట్ స్పష్టం చేస్తోంది.

Also Read : TDP Scheme : మ‌గువ‌కు `మ‌హాశ‌క్తి` చంద్ర‌బాబు

వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ, చంద్ర‌బాబు మీద అభాండాల‌ను వైసీపీ మంత్రులు మోపుతున్నారు. క‌రువుకు పేటెంట్ చంద్ర‌బాబు అన్న‌ట్టు ఫోక‌స్ చేయ‌డం దారుణం. రెండోసారి కూడా వ‌రుస‌గా 2019లో ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉంటే, రాజ‌ధాని నిర్మాణం అయ్యేది. తెలంగాణ కంటే ఎక్కువ‌గా ఏపీలో భూముల ధ‌ర‌లు ఉండేవి. అమెరికా లాంటి దేశాలకు చంద్ర‌బాబు ఎప్పుడో ఏపీ ధాన్యం ఎగుమ‌తి చేసి ఉండే వాళ్లు. ముందుచూపుతో చంద్ర‌బాబు సృష్టించిన సంప‌ద‌తో ఏపీ క‌ళ‌క‌ళ‌లాడుతుండేది. ఆర్థిక కేంద్రంగా విజ‌య‌వాడ‌, ఐటీ సెంట‌ర్ గా విశాఖ‌, హార్డ్ వేర్ హ‌బ్ గా రాయ‌ల‌సీమ‌, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుప‌తి వెలిగిపోతుండేవి. వాస్తవాలు ఇలా ఉండ‌గా, చంద్ర‌బాబు వ‌స్తే క‌రువంటూ `మ‌రో ఛాన్స్` కోసం నీచ‌రాజ‌కీయాల‌కు వైసీపీ దిగ‌జార‌డాన్ని టీడీపీ వెలుగెత్తిచాటుతోంది.

Aslo Read : TDP : మాజీ మంత్రి మాకొద్దంటున్న తెలుగు త‌మ్ముళ్లు.. నియోజ‌క‌వర్గంలో క‌ర‌ప్ర‌తాల పంపిణీ

పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో అన్న‌దాత‌ల క‌ష్టాల‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు రుణ‌మాఫీని ప్ర‌క‌టించారు. ఆ రోజున ఏపీ ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని కోట‌య్య క‌మిటీ సిఫార‌స్సుల మేర‌కు రూ. 1.50ల‌క్ష‌లు ప్ర‌తి కుటుంబానికి మాఫీ చేసింది. రాబోవు రోజుల్లో రైతుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌తి ఏడాది రూ. 20వేలు స‌హాయం అందించేలా చంద్ర‌బాబు ప్ర‌క‌టన చేశారు. మేనిఫెస్టోలో ఈ స‌హాయాన్ని పొందుప‌ర‌చ‌డంతో పాటు మ‌రిన్ని హామీల‌ను రైతుల‌కు ఇవ్వ‌డానికి టీడీపీ సిద్ద‌మ‌యింది.