CBN Dilemma : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీఎం పదవి తీసుకోవడానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. అంటే, రాబోవు రోజుల్లో సంకీర్ణంలో అవకాశం వస్తే కుర్చీ ఎక్కేద్దామని ఆశపడుతున్నారు. ఇదంతా బీజేపీ స్కెచ్ లో భాగంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, తెలంగాణలో కింగ్, ఏపీలో కింగ్ మేకర్ కావాలని కొన్నేళ్లుగా ఆ పార్టీ కలలు కంటోంది. కానీ, ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చతికిల పడింది. ఏపీలో మాత్రం కింగ్ మేకర్ కావాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
పవన్ కల్యాణ్ సీఎం పదవికి సంసిద్ధత (CBN Dilemma)
కేవలం నాలుగు శాతం ఓటు బ్యాంకు ఉన్న పవన్ సీఎం పదవి కోసం ఆశ పడుతున్నారు. పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన ఆయన ఇప్పుడు సీఎం పదవికి అర్హత సాధించానని చెబుతున్నారు. ఎన్నికల తరువాత ఎవరు సీఎం కావాలి? అనేది తేల్చుతామని చెబుతున్నారు. అంటే, ఒక వేళ పొత్తు టీడీపీతో (CBN Dilemma)ఉన్నప్పటికీ సీఎం పదవి కోసం పోటీ పడేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీలతో పాటు ఎన్డీయేతో కలిసి వచ్చే పార్టీలు ఎమున్నాయో త్వరలోనే బయటపడుతుందని పవన్ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేస్తానని చెబుతూ ఆయన ఎన్నికల పెద్దగా భావిస్తున్నారు.
మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు
తొలి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబును (CBN Dilemma) టార్గెట్ గా చేసుకుని కమలనాథులు గేమాడుతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తెర వెనుక వైసీపీ, బీజేపీ రెండు ఒకటే. ఆ రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ బంధం ఉంది. మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి సర్వశక్తులను బీజేపీ ఢిల్లీ పెద్దలు ఉపయోగిస్తారని సర్వత్రా తెలిసిందే.
ఎన్డీయేతో కలిసి నడిచేందుకు చంద్రబాబు(CBN Dilemma)
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను దగ్గరకు తీసినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయడానికి మాత్రమే కమలనాథుల ఎత్తుగడలు ఉంటాయి. ఆ మేరకు వారాహి యాత్రలో పవన్ ఏమి మాట్లాడాలో కూడా కమల నాథుల దిశానిర్దేశం చేసినట్టు చెప్పుకుంటారు. ఎన్డీయేతో కలిసి నడిచేందుకు చంద్రబాబు(CBN Dilemma) సిద్దంగా ఉండేలా ప్లాన్ చేశారు. ఆ మేరకు రాజకీయ చదరంగాన్ని నడుపుతూ వచ్చారు. ఇటీవల హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన తరువాత చంద్రబాబు వాలకం మారింది. ఎన్డీయే కలిసి వెళ్లడానికి మానిసికంగా సిద్దమవుతున్నారు. ఇదే బీజేపీకి కావాల్సింది కూడా. ముగ్గులోకి దించిన తరువాత రాజకీయంగా దెబ్బేసేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడదని మహారాష్ట్ర రాజకీయాన్ని చూస్తున్నాం.
ప్రాంతీయ పార్టీల కారణంగా దేశాభివృధ్ది కుంటుపడుతుందని బీజేపీ సిద్ధాంతం
ఒక వేళ పొత్తుల్లో బీజేపీ, జనసేన కీలకమైతే చంద్రబాబునాయుడు (CBN Dilemma) పాలన సక్రమంగా సాగదు. ముళ్ల మీద నడిచేనట్టే చంద్రబాబు పాలన ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బీజేపీతో కలిసి నడిచేందుకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ప్రాంతీయ పార్టీల కారణంగా దేశాభివృధ్ది కుంటుపడుతుందని మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలోని బీజేపీ సిద్ధాంతం. ఆ విషయాన్ని పలుమార్లు వాళ్లు ప్రస్తావించడమే కాదు, ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో నిర్వీర్యం చేస్తూ రావడాన్ని చూస్తున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ఢిల్లీ బీజేపీ పెద్దలు కన్నేశారు. తృటిలో కేసీఆర్ తప్పించుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం బీజేపీ పద్మవ్యూహంలోకి వెళ్లిపోయారు.
Also Read : TDP-BJP Alliance: టీడీపీ ఎన్డీయే పొత్తుపై బాబు క్లారిటీ
తెలుగుదేశం పార్టీతో పొత్తులేకుండా ఉనికి జనసేన, బీజేపీకి లేదు. కానీ, తమ మద్ధతు లేకుండా అధికారంలోకి రావలేంటూ చంద్రబాబు ఫిక్స్ చేశారు. అందుకోసం పావుగా పవన్ కల్యాణ్ ను చాకచక్యంగా బీజేపీ ప్రయోగించింది. ఒక వైపు జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొడుతూ పరోక్షంగా టీడీపీ మీద దాడులు చేయిస్తుందని సునిశితంగా రాజకీయాలను గమనించే వాళ్లకు తెలుసు. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు బీజేపీ ఒక వైపు జగన్మోహన్ రెడ్డిని మరో వైపు చంద్రబాబును ఆడిస్తోంది. అందుకోసం పవన్ రూపంలోని పదునైనా కత్తిని వాడుతోంది. కేవలం ఒక శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ, నాలుగు శాతం ఉన్న జనసేన దెబ్బకు చంద్రబాబు (CBN Dilemma) తలవంచారు. ఎన్డీయేలో కలిసి వెళ్లడానికి సిద్దమవుతున్నారు. ఇదే టీడీపీ క్యాడర్ ను సందేహాల్లోకి నెట్టేస్తోంది.
Also Read : CBN Raksha Bandhan : చంద్రన్న రాఖీలు వచ్చేస్తున్నాయ్..!
తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోతే, చంద్రబాబుకు చుక్కలు చూపించడానికి బీజేపీ ఏ మాత్రం వెనుకాడదు. అంతేకాదు, పవన్ కల్యాణ్ సీఎం పదవికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంటే ముందుగానే మానసికంగా చంద్రబాబును సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాన్ని గమనిస్తోన్న టీడీపీ క్యాడర్ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేద్దామని సూచిస్తున్నారు. కానీ, ధైర్యంచేసే పరిస్థితుల్లో అధిష్టానం లేకపోవడం భవిష్యత్ కు నష్టం కలిగించేలా ఉందని పార్టీలోని కోర్ లీడర్లలోని చర్చ.