Site icon HashtagU Telugu

AP : జగన్ గాలి ఫై కూడా టాక్స్ వేస్తాడు జాగ్రత్త – చంద్రబాబు

Representatives of BPCL Corporation met with CM Chandrababu

Representatives of BPCL Corporation met with CM Chandrababu

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు (Chandrababu)..జగన్ ఫై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ..పదునైన మాటలను వదులుతూ..జనాల్లో నిలుస్తున్నారు. ఎక్కడిక్కడే జగన్ ను నిలదీస్తూ..ఐదేళ్లలో ప్రజలపై జగన్ వేసిన పన్నులు, అభివృద్ధి లేకుండా లక్షల కోట్లు అప్పు..రాజధాని లేకుండా చేయడం..వంటివి వాటిని జనాల్లోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలోని డోన్ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ..జగన్ గాలి మనిషి, గాలి పైన కూడా టాక్స్ వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ కు తనకు ఎంతో వ్యత్యాసం ఉందని , యువతకు రూ.5 వేల వాలంటీర్ ఉద్యోగం జగన్ ఇచ్చాడని, తాను నెలకు రూ.50 వేల ఐటీ ఉద్యోగం ఇచ్చానని గుర్తు చేశారు. జాబు రావాలంటే బాబు రావాలని పేర్కొన్న చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా DSC పైనే అని పేర్కొన్నారు. ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని, బీసీలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చంద్రబాబు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వే రాళ్ల పైన కూడా జగన్ ఫోటో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించిన ఆయన జగన్ తాత రాజారెడ్డి ప్రజలకు ఏమైనా ఆస్తులు ఇచ్చాడా అంటూ నిలదీశారు. జగన్ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, కరెంటు చార్జీలు 9సార్లు పెంచారని, మద్యం ధరలు పెంచారని, చెత్త మీద కూడా పన్ను వేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఎన్నికలు విధ్వంసకర పాలనకు అభివృద్ధికి మధ్య సవాల్ అంటూ పేర్కొన్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటమని స్పష్టం చేశారు. వైసిపి కి కాలం చెల్లిందని, వారి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also : Nara Brahmani : లోకేష్‌కు మంగళగిరిని విడిచిపెట్టమని చాలా సలహాలు ఇచ్చారు