CBN Demand : క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ఎఫెక్ట్ ! చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బీజేపీ దూత‌లు.?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Demand) ప్ర‌స‌న్నం కోసం బీజేపీ ప‌డిగాపులు క్యూ క‌ట్టే రోజు వ‌చ్చేసింది.

  • Written By:
  • Updated On - May 14, 2023 / 10:31 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Demand) ప్ర‌స‌న్నం కోసం బీజేపీ ప‌డిగాపులు క్యూ క‌ట్టే రోజు వ‌చ్చేసింది. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత బీజేపీ గ్రాఫ్(BJP) దేశ వ్యాప్తంగా అనుమాన స్థాయికి వెళ్లింది. దీంతో ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను పెంచుకోవాలి. లేదంటే, ద‌క్షిణ భార‌త దేశ వ్యాప్తంగా జీరో స్థాయికి వెళ్ల‌డానికి అకాశం ఉంది. అందుకే, ఇప్పుడు చంద్ర‌బాబు స‌హాయ , స‌హ‌కారాల కోసం బీజేపీ ప్ర‌య‌త్నం చేయ‌క తప్ప‌దు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు  ప్ర‌స‌న్నం(CBN Demand)

ఒక‌ప్పుడు ఎన్డీయే (NDA) భాగ‌స్వామిగా ఉన్న ఒరిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా తాజాగా స‌మ‌దూరం అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూట‌మి వైపు ఆయ‌న చూస్తున్నారు. ఇప్ప‌టికే నితీష్ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకోసం బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌త‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ త‌దిత‌రుల ఆశీస్సులు తీసుకున్నారు. జ‌న‌తాప‌రివార్ మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్ట‌డంతో పాటు బ‌ల‌మైన లీడ‌ర్ల‌తో స‌న్నిహిత సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఆ క్ర‌మంలో చిర‌కాల మిత్రునిగా ఉన్న చంద్ర‌బాబును(CBN Demand) కూడా త్వ‌ర‌లో క‌లుస్తార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే, ద‌క్షిణ భార‌త దేశ వ్యాప్తంగా బీజేపీకి మ‌ద్ధ‌తుగా ఉండే లీడ‌ర్ దొరికే ఛాన్స్ లేదు. పైగా చంద్ర‌బాబు జాతీయస్థాయిలో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న లీడ‌ర్.

ఒక‌ప్పుడు ఎన్డీయే (NDA) భాగ‌స్వామిగా ఉన్న ఒరిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ నూత‌నోత్సాహంతో ఉంది. ఇదే స్పీడ్ తో వెళితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ తెలంగాణ లీడ‌ర్లు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ(TDP) మ‌ద్థ‌తు లేకుండా బీజేపీ తెలంగాణ‌లో గెల‌వ‌డం అసంభం. ఆ విష‌యాన్ని చాలా కాలంగా బీజేపీ నేత‌లు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు చంద్ర‌బాబుతో(CBN Demand) అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. ప్ర‌ధానంగా మోడీ దూరంగా ఉంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌హ‌జ మిత్రునిగా ఉంటున్నారు. మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ‌దులుకుని చంద్ర‌బాబు ప‌క్షాన చేర‌క‌పోతే, రాబోవు రోజుల్లో ఢిల్లీ పీఠం కూడా వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also read : CBN Rally : చంద్ర‌బాబు పాద‌యాత్ర‌, 12న`రైతు పోరుబాట‌`

ఏపీ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం క‌ర్ణాట‌క‌లోని సెటిల‌ర్ల‌కు బాగా తెలుసు. అందుకే, సెటిల‌ర్లు బీజేపీకి దూరంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే, బీజేపీకి ప్ర‌తికూలంగా సెంట్ర‌ల్ క‌ర్ణాట‌క ప్రాంతంలో బాగా వెనుక‌బ‌డింద‌ని తెలుస్తోంది.అంతేకాదు, హైద‌రాబాద్ క‌ర్ణాట‌క నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఏపీ సెటిల‌ర్లు బీజేపీని ఓడించార‌ని తెలుస్తోంది. ఇదే ఒర‌వ‌డి కొన‌సాగితే, రాబోవు ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌డానికి తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క ప్రాంతాల్లో సెటిట‌ర్లు సిద్దంగా ఉంటారు. వాళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి చంద్ర‌బాబు(CBN Demand) అవ‌స‌రం ఉంద‌ని బీజేపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. అందుకే, ఇప్పుడు చంద్ర‌బాబు అవ‌స‌రం బీజేపీకి ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read : CBN Fire : బ్లూ,పిచ్చ మీడియాకు వార్నింగ్!`చీప్`న్యూస్ పై చంద్ర‌బాబు అస‌హ‌నం!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బ‌లంగా ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు వేరుగా ఉన్నాయి. ద‌క్షిణ తెలంగాణ ప్రాంతాల్లో క‌నీసం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డానికి అభ్య‌ర్థులు లేరు. పైగా కాంగ్రెస్ పార్టీ అక్క‌డ బ‌లంగా ఉంది. ఇక బీఆర్ఎస్ గ్రేట‌ర్, రంగారెడ్డి జిల్లాల్లో బ‌లం పుంజుకుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజ్యాధికారం దిశ‌గా బీజేపీ అడుగులు వేయాలంటే తెలుగుదేశం మ‌ద్ధ‌తు అనివార్యంగా క‌నిపిస్తోంది. జాతీయ‌, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ ఈక్వేష‌న్లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఎన్డీయేలోకి టీడీపీని తీసుకోవ‌డానికి మోడీ,(Modi) షా ఉత్సాహం చూప‌డానికి టైమొచ్చింది. ఆ లోపుగా కాంగ్రెస్, బీహార్ సీఎం నితీష్ చంద్ర‌బాబును(CBN Demand) ఆక‌ర్షించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తార‌ని తెలుస్తోంది. అందుకే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు కోసం బీజేపీ చ‌ర్చ‌ల‌కు రావాల్సిందే. లేదంటే ఢిల్లీ నుంచి రాష్ట్రాల పీఠాలు కూడా క‌దిలిపోయే ప్ర‌మాదం బీజేపీకి ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.