టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ టూర్ (Delhi Tour) ఫై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో రెండు నెలల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల అంశం అనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే టీడీపీ , జనసేన (TDP-Janasena) కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరితో బిజెపి జత కడుతుందా..లేదా అనేది అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బిజెపి అగ్రనేతలతో భేటీ కానున్నారు. పొత్తుల వ్యవహారం పై ఢిల్లీ వేదికగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి రాజకీయ మద్దతు మాత్రం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు తర్వాత పవన్ ఢిల్లీ కి వెళ్లి , బిజెపి నేతలను కలవనున్నారు.
Read Also : Auto Bandh : ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్…