Site icon HashtagU Telugu

CBN : పంట బీమా కోసం, రైతు దీక్ష‌కు చంద్రబాబు.?

Chandrababu

Cbn

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు(CBN) దెబ్బ‌కు ప్ర‌భుత్వం ఒక మెట్టు దిగింది. అకాల వ‌ర్షం కార‌ణంగా న‌ష్ట‌పోయిన పంటకు పరిహారం ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) స‌ర్కార్ ముందుకొస్తోంది. గోదావ‌రి జిల్లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించే వ‌ర‌కు బ‌స్తాల‌ను కూడా ఇవ్వ‌కుండా 20 రోజులుగా రైతులను ప్ర‌భుత్వం వేధించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌లేదు. కానీ, చంద్ర‌బాబు రైతుల వ‌ద్ద‌కు వెళ్లి వాళ్ల బాధ‌ల‌ను చూసిన త‌రువాత ప్ర‌భుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు. 72 గంట‌ల్లో పంట న‌ష్ట‌పోయిన రైతులకు ప‌రిహారంతో పాటు ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోతే దీక్ష‌కు దిగుతాన‌ని హెచ్చ‌రించారు. దీంతో ధాన్యం కొనుగోలుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కొంత మేర‌కు ముందుకు క‌దిలింది.

ప్ర‌భుత్వానికి    చంద్ర‌బాబు అల్టిమేటమ్(CBN) 

రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా బ‌స్తాల‌ను కొంత మేర‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంది. టెలికాన్ష‌రెన్స్ నిర్వ‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. రైతుల వ‌ద్ద నున్న ధాన్యాన్ని త‌ర‌లించ‌డానికి బ‌స్తాల‌ను ఇవ్వాల‌ని ఆదేశించారు. గ్రామ‌, వార్డు సచివాల‌యాల్లో న‌ష్టం అంచ‌నాల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. ప‌రిహారం అందించే దిశ‌గా ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరుతూ మిల్ల‌ల వ‌ద్ద‌కు ధాన్యం స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించారు. కానీ, పూర్తి స్థాయిలో యంత్రాంగం ముందుకు క‌ద‌ల్లేదు. మంత్రులు ఒక‌రిద్ద‌రు క్షేత్రస్థాయికి వెళ్లిన‌ప్ప‌టికీ రైతుల‌కు న్యాయం జ‌ర‌గ‌డంలేదు. వ‌ర్షానికి ధాన్యం త‌డిసి మొక్క‌లు వ‌చ్చాయ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు(Minister Nageswarrao)వ‌ద్ద రైతులు గోడు వెళ్ల‌బోసుకున్నారు. ఎర్రిపాప వ‌ర్షానికి ధాన్యం త‌డిస్తే న‌న్ను ఏం చేయ‌మంటావ్ అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నంగా ఆయ‌న కామెంట్స్ ఉండ‌డాన్ని విప‌క్షాలు వేలెత్తి చూపుతున్నాయి.

ఎర్రిపాప వ‌ర్షానికి ధాన్యం త‌డిస్తే న‌న్ను ఏం చేయ‌మంటావ్

త‌డిసిన ధాన్యంకు నూక వ‌స్తుంద‌ని చెబుతూ రైతుల నుంచి మిల్ల‌ర్లు డబ్బులు వ‌సూలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తూకం వేసి పంపిన ధాన్యం నుంచి 5 కేజీలు తరుగును మిల్ల‌ర్లు తీసేస్తున్నారు. ఇలా ప‌లు ర‌కాలుగా బ‌స్తాకు రూ. 300 రూపాయాలు రైతు న‌ష్ట‌పోతున్నాడు. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు(CBN) వ‌ద్ద రైతులు చెప్పుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బస్తాకు రూ.1530 రావడం లేదు. ప్రభుత్వం సకాలంలో సేకరణ చేయలేకపోయింది. కనీసం గోతాలు కూడా ఇవ్వలేకపోయారు. రంద్రాలు పడ్డ గోతాలు ఇవ్వడం వల్ల కూడా రైతులు నష్టపోయారు.

9వ తేదీ ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మొమోరాండం

రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం కౌలు రైతులు. వాళ్ల‌లో ఎక్కువ‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపులు ఉంటారు. పొలంలో పంట ఉంటేనే పరిహారం ఇస్తామని ప్ర‌భుత్వం చెబుతోంది. ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదు. ధాన్యం అకాల వర్షాల భారిన పడేది కాదు. ఈ సమస్యకు పూర్తి కారణం సిఎం జగన్ రెడ్డి అంటూ చంద్ర‌బాబు(CBN) ఇటీవ‌ల గోదావ‌రి జిల్లాకు వెళ్లిన సంద‌ర్భంగా ఆరోపించారు. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉంది. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు .

Also Read : CBN Fire : బ్లూ,పిచ్చ మీడియాకు వార్నింగ్!`చీప్`న్యూస్ పై చంద్ర‌బాబు అస‌హ‌నం!!

ధాన్యం కొనకపోతే 9వ తేదీ ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మొమోరాండం ఇస్తాం. ‘మా పంట మునిగింది…పరిహారం ఇవ్వండి’ అనే స్లోగన్ తో పోరాటం చేస్తాం. ప్రభుత్వం అప్పటికీ స్పందిచకపోతే, 13వ తేదీ నిరసన దీక్ష చేపడతాం…నేను కూడా నిరసనలో పాల్గొంటా` అంటూ నాలుగు రోజుల క్రితం చంద్ర‌బాబు(CBN) ప్ర‌క‌టించారు. అంతేకాదు, 72 గంట‌ల అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో కొంత మేర‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో రైతుల‌కు న్యాయం జ‌ర‌గ‌డంలేదు. పైగా పంట బీమా సొమ్ము ప్ర‌భుత్వం స‌కాలంలో చెల్లించ‌లేదు. ఫ‌లితంగా ప‌రిహారం వ‌స్తుందా? రాదా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈనెల 13వ తేదీన చంద్ర‌బాబు దీక్ష‌కు దిగుతార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వం నుంచి పంట బీమా విష‌యంలో స్ప‌ష్ట‌మైన వైఖ‌రి తెలియ‌చేయాల‌ని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Also Read : CBN Plan : మోడీతో బాల‌య్య భేటీ? భార‌త ర‌త్న, పొత్తు ఎజెండా!

ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, 40 నుంచి 50 శాతం పంట ఇంకా పొలాల్లో ఉందని చంద్రబాబు(CBN) అంచనా. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారని, మిగిలిన పంట కల్లాల్లోనే ఉందని ఆయన గత వారం చేసిన పర్యటనలో తేల్చారు. వీటికి పరిష్కారం చూపకపోతే దీక్షకు దిగడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారు. ఈ నెల 13న దీక్ష చేయ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఆ తరువాత పెందుర్తి, అనకాపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో మే 16, 17, 18 తేదీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Venkanna) ప్రకటించారు.