CBN Case : తొక్కిస‌లాట‌పై జ‌గ‌న్ క‌మిష‌న్, చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చే దిశ‌గా..?

చంద్ర‌బాబు(CBN Case) దూకుడును ఆప‌డానికి ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.

  • Written By:
  • Updated On - January 20, 2023 / 04:55 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు (CBN Case) దూకుడును ఆప‌డానికి ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన కందుకూరు, గుంటూరు తొక్కిస‌లాట మీద రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి శేషశయన నేతృత్వంలోని ఏకవ్యక్తి కమిషన్ (Commission) ద‌ర్యాప్తును ప్రారంభించింది. నెల రోజుల్లోపు నివేదిక‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం డెడ్ లైన్ పెట్టింది. ఆ మేర‌కు క‌మిష‌న్ అనుమానితుల‌కు నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరుతోంది.

చంద్ర‌బాబునాయుడు దూకుడును ఆప‌డానికి (CBN Case)

నెల్లూరు జిల్లా కందుకూరు రోడ్ షో సంద‌ర్భంగా తొక్కిసలాట జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆ సంఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతి చెందారు. త‌క్కువ విస్తీర్ణం ఉన్న రోడ్డులో షో పెట్ట‌డం కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అక్క‌డ కొంద‌రు వైసీపీ స్లీప‌ర్ సెల్స్ చేసిన ప‌నిగా టీడీపీ అనుమానిస్తోంది. డ్రోన్ కెమెరాల్లో జ‌నం వ‌చ్చిన‌ట్టు చూపించ‌డానికి ఉద్దేశ‌పూర్వ‌కంగా చంద్ర‌బాబు (CBN Case) ఇరుకు సందుల్లో రోడ్ షోలు పెట్టార‌ని వైసీపీ తొలి న ఉంచి చేస్తోన్న ఆరోప‌ణ‌. ఇలా రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోపించుకుంటూ రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించాయి. ఆ లోపు జీవో నెంబ‌ర్ 1 జారీ చేయ‌డం కార‌ణంగా చంద్ర‌బాబు తాత్కాలికంగా `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..` కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డంలేదు.

Also Read : CBN Power : అధికార మార్పుపై అంచ‌నా, చంద్ర‌బాబుతో IAS,IPSల ర‌హ‌స్య‌ భేటీ

కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే గుంటూరు వేదిక‌గా తొక్క‌స‌లాట జ‌రిగింది. అక్క‌డ ముగ్గురు చ‌నిపోయారు. నెల్లూరు జిల్లా కందుకూరులో డిసెంబర్ 28న, జనవరి 1న గుంటూరులో దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. గుంటూరులో ముగ్గురు వ్యక్తులు తొక్కిసలాట జరిగిన స్థలాన్ని గురువారం జస్టిస్‌ రెడ్డి (Commission) పరిశీలించారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాక్షులు, మృతుల బంధువుల వివరాలను నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, ఇతర అధికారులు తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి జస్టిస్ రెడ్డితో కలిసి వెళ్లారు. చంద్ర‌బాబునాయుడు గుంటూరు వేదిక‌పై నుంచి వెళ్లిన కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగిన విషయాన్ని సీరియ‌స్ గా ప‌రిశీలించారు. ఉచిత రేషన్‌ కిట్‌ల పంపిణీ సందర్భంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. కనీసం డజను మంది గాయపడ్డారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్  ఏకసభ్య కమిషన్‌

రెండు సంఘ‌ట‌న‌ల త‌రువాత జారీ చేసిన జీవో నెంబ‌ర్ 1 పై గురువారం సుప్రీం కోర్టు విచార‌ణ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో ఈ కేసును విచార‌ణ చేయ‌డానికి లేద‌ని తేల్చింది. హైకోర్టు డివిజ‌న్ బెంచ్ వ‌ద్ద వాద‌ప్ర‌తివాద‌న‌ల‌ను వినిపించాల‌ని ఆదేశించింది. ఒక వైపు సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మ‌రో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Also Read : Janasena-TDP : వారాహి, యువ‌గ‌ళం `సుప్రీం` షో, జీవో నెంబ‌ర్ 1 ట్విస్ట్

ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఎదుట చంద్ర‌బాబునాయుడును హాజ‌ర‌ప‌రిచేలా వైసీపీ ప్లాన్ చేస్తోంద‌ని తెలుస్తోంది. కందుకూరు, గుంటూరు సంఘ‌ట‌న‌ల‌ను నిశితంగా అధ్య‌య‌నం చేయ‌డానికి ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కందుకూరు వ‌ద్ద సంఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కొన్ని నిమిషాల ముందే చంద్ర‌బాబు క్యాడ‌ర్ ను అప్ర‌మ‌త్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అలాగే, చంద్ర‌బాబు వెళ్లిన త‌రువాత కొద్ది నిమిషాల‌కు గుంటూరు దుర్ఘ‌ట‌న జ‌రిగింది. అందుకే, చంద్ర‌బాబునాయుడును కూడా పిలిచి విచారించ‌డానికి ఏక‌స‌భ్య క‌మిష‌న్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.