CBN Case In Court : చంద్ర‌బాబు కోసం ప్ర‌ముఖ న్యాయ‌వాదులు..

CBN Case In Court : స్కిల్ కేసులో జైలులో ఉన్న‌ చంద్ర‌బాబు కోసం లండ‌న్ నుంచి హ‌రీశ్ సాల్వే విజ‌య‌వాడ వ‌చ్చారు.

  • Written By:
  • Updated On - September 19, 2023 / 02:02 PM IST

CBN Case In Court : స్కిల్ కేసులో జైలులో ఉన్న‌ చంద్ర‌బాబు కోసం లండ‌న్ నుంచి హ‌రీశ్ సాల్వే విజ‌య‌వాడ వ‌చ్చారు. హైకోర్టులో వాద‌న‌ల‌ను వినిపించ‌డానికి ఆయ‌న రావ‌డం పెద్ద న్యూస్ గా మారింది. సుప్రీం కోర్టులో వాదించే లాయ‌ర్లు ఇప్పుడు చంద్ర‌బాబు కోసం హైకోర్టు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్దార్థ్ లూద్రా, హ‌రీశ్ సాల్వే త‌దిత‌ర ప్ర‌ముఖులు చంద్ర‌బాబు ప‌క్షాన నిలిచారు. ప్ర‌తిగా సీఐడీ త‌ర‌పున ముహుల్ రోద్గ‌తి లాంటి రంగంలోకి దిగారు. ఇప్ప‌టికే సీఐడీ టీమ్ క‌స్ట‌డీ పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు కోసం లండ‌న్ నుంచి హ‌రీశ్ సాల్వే (CBN Case In Court)

క్వాష్ ప‌టిష‌న్ తో పాటు ఏపీ సీఐడీ వేసిన ప‌లు కేసులను స‌వాల్ చేస్తూ చంద్ర‌బాబు (CBN Case In Court) త‌ర‌పున న్యాయవాదులు పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ విష‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని సీఐడీ కేసు న‌మోదు చేసింది. దాన్ని స‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్ విచార‌ణ‌ను ఈనెల 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను సవాల్ చేస్తూ క్వాష్ పిటిష‌న్ మీద వాద‌న‌ల‌ను వినిపించడానికి దేశంలోని ప్ర‌ముఖ న్యాయ‌వాదులు హాజ‌రు రావ‌డంతో హైకోర్టు వైపు అంద‌రి చూపు పడింది.

క్వాష్ పిటిష‌న్ మీద వాద‌న‌ల‌ను 

సాధార‌ణందా బెయిల్ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అనుకుంటారు. కానీ, ఆయ‌న త‌ర‌పున లాయర్లు సిద్దార్థ్ లూథ్రా, హ‌రీశ్ సాల్వే మాత్రం బాబు మీద పెట్టిన కేసులు స‌క్ర‌మంగా లేవ‌ని వాదిస్తున్నారు. ఏపీ సీఐడీ పెట్టిన సెక్ష‌న్లు, చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన తీరు చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని వాదిస్తున్నారు. ప‌దేళ్ల పాటు శిక్షప‌డేలా ఉన్న 409 సెక్ష‌న్ వ‌ర్తించ‌ద‌ని తొలి నుంచి లూథ్రా వాదిస్తున్నారు. ఏపీ ఏసీబీ కోర్టులో వాద‌న‌లు వినిపించిన ఆయ‌న హైకోర్టులోనూ చంద్ర‌బాబు మీద పెట్టిన కేసులు చ‌ట్ట విరుద్ధంగా ఉన్నాయ‌ని అంటున్నారు. కేసుల‌ను కొట్టేయాల‌ని  (CBN Case In Court) బ‌ల‌మైన వాద‌నలు వినిపించ‌డానికి త‌మ అనుభ‌వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

Also Read : Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

లండ‌న్ నుంచి వ‌చ్చిన హ‌రీశ్ సాల్వే ఏకంగా చంద్ర‌బాబు అరెస్ట్ ను త‌ప్పుగా వాదిస్తూ అందుకు బాధ్యులుగా సీఐడీ పోలీసుల‌ను బోను నిల్చోబెట్టాల‌ని చూస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి లేకుండా చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డానికి లేద‌ని సాల్వే వాద‌న‌. అందుకు సంబంధించిన ప‌లు సెక్ష‌న్ల‌ను, రాజ్యాంగంలోని ప‌లు నిబంధ‌న‌ల‌ను హైకోర్టు ముందు ఉంచారు. స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కేసులోని లోతుపాతుల‌కు వెళ్ల‌కుండా చంద్ర‌బాబు అరెస్ట్ అక్ర‌మం అనే కోణంలోనే ప్ర‌ముఖ న్యాయ‌వాదులు వాదించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Chandrababu : బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు కు మద్దతు తెలుపడం వెనుక అసలు కారణాలు ఏంటి..?

జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్ర‌బాబును అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న విడుద‌ల మీద ఉత్కంఠ నెల‌కొంది. ఏపీ ఏసీబీ కోర్టు ఈనెల 10వ తేదీన రిమాండ్ విధించింది. అదే రోజు రాజ‌మండ్రి జైలుకు ఆయ‌న్ను త‌ర‌లించారు. మ‌రుస‌టి రోజు హౌస్ రిమాండ్ కావాల‌ని పిటిష‌న్ వేశారు. దాన్ని కూడా ఏసీబీ కోర్టు (CBN Case In Court) తిర‌స్క‌రించింది. దీంతో లూథ్రా ట్వీట్ చేస్తూ ఇక క‌త్తితో యుద్ధ‌మే స‌రంటూ ఒక ట్వీట్ చేసి ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ నుంచి ఆయ‌న కేసుల‌ను స‌మీక్షించారు. ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ను స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు. వాద‌ప్ర‌తివాద‌న‌ల‌ను విన్న హైకోర్టు క్వాష్ పిటిష‌న్ పై త‌దుప‌రి విచార‌ణ సాయంత్రానికి వాయిదా వేసింది.