Site icon HashtagU Telugu

Euphoria Musical Night : ఒకే ఫ్రేమ్ లో CBN , బాలకృష్ణ , పవన్

Euphoria Musical Night1

Euphoria Musical Night1

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సంగీత విభావరికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna), రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అత్యంత ఆత్మీయంగా ఆహ్వానించారు.

Euphoria Musical Nigh3

Euphoria Musical Nigh2

ఈ కార్యక్రమం తలసేమియా బాధితుల సహాయార్థంగా నిర్వహించబడింది. ఈ సందర్బంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. “ఈవెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా తలసేమియా బాధితులకు అందజేస్తామని” స్పష్టం చేశారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ నైట్‌ను నిర్వహించడం విశేషం. సంగీత ప్రియులను ఆకర్షించడమే కాకుండా, సమాజానికి మేలు చేసే ఈ ప్రయత్నాన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రశంసించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండే సంస్థగా పేరుగాంచింది. ఆరోగ్య, విద్య, సంక్షేమ రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పుడు తలసేమియా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం అందరికీ ఆదర్శప్రాయమైన విషయం. ముఖ్యంగా టికెట్ ద్వారా సేకరించిన ప్రతీ రూపాయి బాధితులకు చేరుతుంది అనడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ మ్యూజికల్ నైట్‌లో వివిధ సినీ గాయకులు, సంగీత కళాకారులు పాల్గొని తమ పాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు. ప్రత్యేకంగా తమన్ స్వయంగా ఈ వేడుకలో తన సంగీతాన్ని అందించడం, కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత ప్రదర్శనలతో పాటు, పలువురు ప్రముఖులు తలసేమియా బాధితుల సహాయార్థం తమ మొక్కుబడిని ప్రకటించి, తమ వంతుగా సహాయం అందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై మరింత మంది ప్రజలు అవగాహన పొందారు.