చంద్రబాబు (Chandrababu)..ఇది పేరు కాదు ఓ బ్రాండ్. తన రాజకీయ అనుభవంతో ..తనదైన శైలిలో మాయ చేసే సమర్ధుడు. ప్రస్తుతం దావోస్ పర్యటన(Davos Tour)లో అందర్నీ ఆకట్టుకుంటూ..అందర్నీ చేత ”Darling of davos ” అనిపించుకుంటున్నాడు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల అధినేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, చంద్రబాబు తన అనుభవాన్ని చాటుకుంటున్నారు. మాయర్స్, సిస్కో వంటి ప్రపంచ స్థాయి కంపెనీల సీఎంలతో ప్రత్యేక సమావేశాలు జరిపారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రత్యేక సమావేశాలకు సమయం కేటాయించారు.
Fact Check: ‘‘రాజకీయాలకు గుడ్ బై.. అమెరికాకు కేసీఆర్’’.. ఈ ప్రచారంలో నిజమెంత ?
బుధువారం తన సహచర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (తెలంగాణ సీఎం) మరియు దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర సీఎం)లతో సమావేశమయ్యారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో వీరితో దిగిన ఫోటోను “టీమ్ ఇండియా ఎట్ డావోస్” అనే శీర్షికతో పంచుకున్నారు. జూరిక్ ఎయిర్‌పోర్ట్‌లో రేవంత్‌ను కలిసిన తర్వాత ఇది వారి రెండో భేటీ కావడం విశేషం. ఫడ్నవీస్‌తో చంద్రబాబుకు ముందు నుండే సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మహారాష్ట్రలో NDA తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు, ఫడ్నవీస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. డావోస్ వేదిక మీద కూడా వారి మధ్య సఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు 10 సార్లు డావోస్‌కు వెళ్లిన అనుభవజ్ఞుడైన చంద్రబాబు, ప్రపంచ ఆర్థిక వేదిక వాతావరణాన్ని అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఇతర భారతీయ ప్రతినిధులకూ మానసిక ఉత్సాహం కలిగించడంలో సహాయపడుతోంది. ఆయన నాయకత్వంలో భారతీయ బృందం గ్లోబల్ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. దావోస్ పర్యటన లో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకరావడమే కాదు అందర్నీ చేత శభాష్ అనిపించుకుంటూ మరోసారి చంద్రబాబు వార్తల్లో నిలిచారు.