Site icon HashtagU Telugu

CBN Arrow : గుడివాడ టీడీపీ అభ్య‌ర్థిగా తార‌క‌ర‌త్న‌? `నంద‌మూరి`తో కొడాలికి చెక్!

CBN Arrow

Nani.tarak Jpg

కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట‌. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ అక్క‌డి నుంచి గెలుస్తూ వ‌చ్చారు. ఆయ‌న స్వ‌ర్గ‌స్తులు అయిన త‌రువాత హ‌రికృష్ణ చేతుల్లోకి గుడివాడ వెళ్లింది. అక్క‌డ నుంచి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నానికి టీడీపీ టిక్కెట్ ఇవ్వ‌డానికి కార‌ణం హ‌రికృష్ణ‌. రెండుసార్లు టీడీపీ త‌ర‌పున వరుస‌గా గెలిచిన కొడాలి మ‌రో రెండు సార్లు వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. గ‌త నాలుగు ఎన్నిక‌ల్లో కొడాలి తిరుగులేకుండా అక్క‌డ నుంచి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న చంద్ర‌బాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నోరుపారేసుకుంటున్నారు. దీంతో ఆయ‌న్ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించ‌డం ద్వారా బుద్ది చెప్పాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది. అందుకోసం ధీటైన అభ్య‌ర్థి కోసం అన్వేషిస్తూ నంద‌మూరి తార‌క‌ర‌త్న(CBN Arrow) ను బ‌రిలోకి దింపాల‌ని యోచిస్తోంది.

నంద‌మూరి హీరోల్లో తార‌కర‌త్న..(CBN Arrow)

తొలి నుంచి తెలుగుదేశం పార్టీ విజ‌యానికి త‌న‌వంతు కృషి చేస్తున్న నంద‌మూరి హీరోల్లో తార‌కర‌త్న(CBN Arrow) మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. ఆయ‌న చంద్ర‌బాబు కుటుంబానికి కూడా స‌న్నిహితంగా ఉంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కీల‌కంగా ఉండాల‌ని తార‌ర‌త్నం భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగాల‌ని చూస్తున్నారు. ఆ విష‌యాన్ని టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తో ను క‌లిసి సంద‌ర్భంగా నందమూరి తారకరత్న ప్ర‌స్తావించార‌ని తెలుస్తోంది. వాళ్లిద్ద‌రి భేటీ సంద‌ర్భంగా ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా జరిగినట్లు స‌మాచారం. వ‌రుస‌కు బావ, బామ్మర్దులు క‌లుసుకోవ‌డం కామన్. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉందని తారక రత్న ఇటీవ‌ల వెల్లడించిన కార‌ణంగా ఈ బేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేయ‌డానికి తార‌క‌ర‌త్నం సిద్ధ‌మైన‌ట్టు లోకేష్ వ‌ద్ద ప్ర‌స్తావించార‌ని టీడీపీ వ‌ర్గాల్లో టాక్.

Also Read : Taraka Ratna: రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న తారకరత్న, లోకేష్ భేటీ!

వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబ సంపూర్ణ మద్దతు తెలుగు దేశానికి ఉంటుందని తార‌క‌ర‌త్న చెబుతున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ప్ర‌చారానికి వ‌స్తార‌ని ఇటీవ‌ల ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న వెల్ల‌డించారు. ఇటీవ‌ల గుడివాడ(Gudiwada) నియోజ‌క‌వ‌ర్గానికి కూడా తార‌ర‌త్న వెళ్లారు. అక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల‌తోనూ క‌లిశారు. ప్ర‌స్తుతం మూడు గ్రూపులుగా గుడివాడ టీడీపీ ఉంది. వాటిని ఐక్యం చేయ‌డంతో పాటు నంద‌మూరి కుటుంబం నుంచి తార‌క‌ర‌త్న‌ను రంగంలోకి దింపితే ప‌లు కోణాల నుంచి క‌లిసి వ‌స్తుంద‌ని అంచనా వేస్తున్నారు.

నంద‌మూరి కంచుకోట‌గా ఉన్న గుడివాడ 

గతంలో కూడా నందమూరి తారకరత్న తెలుగుదేశం పార్టీ కోసం ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవ‌స‌ర‌మైన చోట ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఒక్క‌డో కాకుండా నంద‌మూరి కంచుకోట‌గా ఉన్న గుడివాడ(Gudiwada) పోటీ చేయ‌డానికి అనువైన నియోజ‌కవ‌ర్గంగా ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తార‌ర‌త్న అభ్య‌ర్థిత్వం గుడివాడ‌కు మంచిదేన‌ని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుంద‌ట‌. రాజ‌కీయంగా నంద‌మూరి కుటుంబాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ఎదుర్కోలేరు. పైగా ఆ కుటుంబం మీద విమ‌ర్శ‌లు చేయ‌డానికి ధైర్యం చేయ‌రు. కేవ‌లం చంద్ర‌బాబు, నారా కుటుంబం మీద మాత్ర‌మే ఒంటికాలు మీద ఆయ‌న లేస్తారు. క‌నుక‌, నంద‌మూరి కుటుంబానికి చెందిన తార‌క‌ర‌త్న‌ను రంగంలోకి దింప‌డం ద్వారా కొడాలి కోర‌లు పీకాల‌ను చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

Also Read : Telugu Film :టాలీవుడ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిచ్చు! చిరు, బాల‌య్య సినిమాల‌ వార్‌!