CBN Arrest : చంద్ర‌బాబు అరెస్ట్ కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్? రాస్తారోకోల‌కు టీడీపీ పిలుపు

చంద్ర‌బాబునాయుడును అరెస్ట్(CBN Arrest)ను అరెస్టు చెయ్యడానికి

  • Written By:
  • Updated On - January 5, 2023 / 01:28 PM IST

మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడును అరెస్ట్(CBN Arrest) చేసేందుకు ఏపీ పోలీస్ ప్లాన్ చేస్తోంది. ఆయ‌నకు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేశారు. విధుల‌ను అడ్డుకున్నార‌ని పోలీసులు(police) కొత్త‌గా కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, కందుకూరు, గుంటూరు తొక్కిస‌లాట‌లో మృతికి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ వైసీపీ చెబుతోంది. ఆ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్టు సమాచారం. ఆ రెండు ఘ‌ట‌న‌ల త‌రువాత రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిషేధిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. బ్రిటీష్ కాలం నాటి ఉత్త‌ర్వుల‌తో అన‌ధికార ఎమ‌ర్జెన్సీ ఏపీలో కొన‌సాగుతోంది.

చంద్ర‌బాబు అరెస్ట్ కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్?(CBN Arrest)

కుప్పంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు బుధ‌వారం వెళ్లిన చంద్ర‌బాబునాయుడును చిత్తూరు జిల్లా పోలీసులు(police) అడ్డుకున్నారు. బెంగుళూరు విమానాశ్ర‌యం నుంచి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నించారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున అక్క‌డికి త‌ర‌లి వ‌చ్చిన క్యాడ‌ర్, పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల మీద లాఠీ చార్జి చేశారు. కొంద‌రు మ‌హిళ‌లు లాఠీ చార్జి సంద‌ర్భంగా స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. నిషేదాజ్ఞ‌ల‌ను ధిక్క‌రిస్తూ చంద్ర‌బాబు కుప్పంలోకి ప్ర‌వేశించ‌డం కార‌ణంగా లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య త‌లెత్తింద‌ని ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేశారు. పోలీసుల మీద తిర‌గ‌బ‌డ్డ ప‌లువురు కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెట్టారు. వాళ్ల‌ను అదుపులోకి తీసుకోవ‌డానికి పోలీసులు సిద్ధ‌మ‌య్యారు. పోలీసుల వార్నింగ్ ల‌ను కాద‌ని చంద్ర‌బాబు పిలుపుకు క్యాడ‌ర్ పెద్ద ఎత్తున ముందుకు క‌దులుతోంది.

పోలీసులు, చంద్ర‌బాబుకు మ‌ధ్య వాద‌ప్ర‌తివాద‌న‌లు

రోడ్ షో, బ‌హిరంగ సభ‌ను నిరాక‌రిస్తున్నట్టు రాత‌పూర్వ‌కంగా తెలియ‌చేయాల‌ని చంద్ర‌బాబునాయుడు పోలీసులను డిమాండ్ చేశారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించ‌డాన్ని అడ్డుకున్న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో బుధ‌వారం వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను చూపుతూ నోటీసులు ఇవ్వ‌డానికి పోలీసు ఉన్న‌తాధికారులు ప్ర‌య‌త్నించారు. కానీ, చంద్ర‌బాబు వాటిని నిరాక‌రిస్తూ ఏ చట్టం ప్ర‌కారం అడ్డుకుంటున్నారో, రాత‌పూర్వ‌కంగా తెలియ‌చేయాల‌ని కోరారు. ఆ క్ర‌మంలో పోలీసులు, చంద్ర‌బాబుకు మ‌ధ్య వాద‌ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి. దీంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన క్యాడ‌ర్ పోలీసుల మీద ఆగ్ర‌హించారు. కొన్ని గంట‌ల పాటు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆ సంద‌ర్భంగా లాఠీ చార్జి కూడా జ‌రిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ కు చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ పోలీసులు కేసు న‌మోదు చేశార‌ని తెలిసింది. విధుల‌కు ఆటంకం కలిగిస్తూ ప్ర‌వ‌ర్తించార‌ని చంద్ర‌బాబు మీద కేసు క‌ట్టార‌ని స‌మాచారం. ఆ మేర‌కు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read : CBN Kuppam : కుప్పం ప‌ర్య‌ట‌న‌పై పోలీస్ జులుం! క‌ర్ణాట‌క‌, ఏపీ బోర్డ‌ర్లో హై టెన్ష‌న్‌!

చంద్ర‌బాబును అరెస్ట్ (CBN Arrest) చేస్తే వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ రోడ్ల మీద‌కు రావాల‌ని కేంద్ర కార్యాల‌యం నుంచి సంకేతాల‌ను అందుకున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాలో ఉన్నటువంటి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మండల,జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. పార్టీ ఆఫీస్ రోడ్డుకి రెండు వైపులా ముళ్లతీగ వేశారు. ఏక్ష‌ణ‌మైన చంద్రబాబు నాయుడుని అరెస్టు చెయ్యడానికి జగన్ రెడ్డి రంగం సిద్ధం చేయిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్ .

Also Read : CBN Power : వ‌చ్చే ఎన్నిక‌ల్లో `తెలుగుదేశం`దే అధికారం! `ఆత్మ‌సాక్షి`కండిష‌న్స్ అప్లై.!