తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) అవుతారా? ఆయన చేసిన నేరం ఏమిటి? ఆదాయ పన్ను చెల్లించలేదని చేసిన అభియోగం అరెస్ట్ కు దారితీస్తుందా? సోషల్ మీడియా వేదికగా అరెస్ట్ ఖాయమంటూ వైసీపీ చెబుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే చెబుతున్నారు. కానీ, టీడీపీ మాత్రం చంద్రబాబు ఏ తప్పు చేయలేదని చెబుతూ అరెస్ట్ అంతా ఫేక్ అంటూ ప్రతిగా రియాక్ట్ అవుతోంది. హఠాత్తుగా చంద్రబాబు మాత్రం మరో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు.
ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం(CBN Arrest)
ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు (CBN Arrest) ఎప్పుడూ మాటతూలరు. సరైన ఆధారం ఉంటేనే ఆయన మీడియాకు చెబుతారు. తన అరెస్ట్ ను ఆయనే ఇప్పుడు ధ్రువీకరించడం టీడీపీ వర్గాల్లో అలజడి మొదలైయింది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం `బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారంటీ` పేరుతో ఆయన ప్రోగ్రామ్ లను చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనంతపురం జిల్లాకు బళ్లారిలో జరిగిన కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. రాత్రి అనంతపురంలోనే బస చేసిన ఆయన బుధవారం మీడియా ముందుకు వచ్చారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు మరో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వెల్లడించడం గమనార్హం.
విదేశాల నుంచి బినామీ కంపెనీల్లోకి
నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే (CBN Arrest) అవకాశం ఉందని చెబుతూ తనపై కూడా దాడి చేస్తారని ఆందోళన చెందారు. కేసులు, అరెస్ట్ లు ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని ధీమా వ్యక్తపరిచారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా అంచనా వేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
Also Read : CBN No Arrest : ఆగడు..ఆపలేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!
ఏపీ తొలి సీఎంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో వివిధ కాంట్రాక్టు సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. లెక్క చూపని డబ్బు 118 కోట్లు ఉందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఆ మేరకు రెండుసార్లు నోటీసులు అందుకున్నారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? అనే దానిపై ఐటీశాఖ ఆరాతీయగా, విదేశాల నుంచి బినామీ కంపెనీల్లోకి వచ్చిందని అనుమానిస్తోంది. దానిపై ఈడీ రంగంలోకి దిగుతుందని రెండు రోజులుగా వైసీపీ లీడర్లు చెబుతున్నారు. బహుశా అందుకే, మరో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించి ఉంటారు. ఏదేమైనా గత వారం రోజులుగా చంద్రబాబు అరెస్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోన్న న్యూస్ కు ఆయనే ఆమోద ముద్ర వేయడం సంచలనం కలిగిస్తోంది.
Also Read : CBN Social Media : పొత్తు కోసం చంద్రబాబుపై ఐటీ ప్రయోగం?