Site icon HashtagU Telugu

CBN America Style : చంద్ర‌బాబు అమెరికా త‌ర‌హా ఎన్నిక‌ల ప్ర‌చారం

CBN

Cbn Power Point

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల త‌ర‌హాలో చంద్ర‌బాబు (CBN America Style) వినూత్నంగా ప‌వ‌ర్ ప్ర‌జంటేష‌న్ ను ఎంచుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వినూత్న స‌ర‌ళిలో అయ‌న ముందడుగు వేశారు. బ‌హిరంగ స‌భ‌ల‌కు దూరంగా ఉంటూ వివిధ అంశాల‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రిగేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదంతా అమెరికా త‌ర‌హా ప్ర‌చారంగా క్యాడ‌ర్ చెప్పుకుంటోంది.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల త‌ర‌హాలో చంద్ర‌బాబు (CBN America Style)

ప్రాజెక్టుల చిట్టాను టీడీపీ అధినేత చంద్ర‌బాబు విప్పారు. ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌చ్చింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష స‌మావేశం పెట్టారు. రాష్ట్రంలోని నీటి నిర్వ‌హ‌ణ‌, ప్రాజెక్టుల గురించి స‌మీక్షించారు. తాజాగా చంద్ర‌బాబు  (CBN America Style) సాధించిన విజ‌యంగా ఈ ప‌రిణామాన్ని చెప్పుకోవ‌చ్చు. ఎప్పుడూ బీజీగా ఉండే చంద్ర‌బాబు ప్రొఫెస‌ర్ గా మార‌డం వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఆయ‌న పార్టీ కార్యాల‌యం నుంచి రెండు రోజులుగా ఇస్తోన్న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ప్ర‌జ‌ల్ని ఆలోచింప చేస్తోంది.

వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయవచ్చని చంద్ర‌బాబు

రాయ‌ల‌సీమ‌కు జ‌గ‌న్మోమ‌న్ రెడ్డి చేసిన ద్రోహాన్ని బుధ‌వారం విడ‌మ‌రిచి చెప్పారు. నీటి పారుద‌ల రంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వాల‌కాన్ని క‌ళ్ల క‌ట్టిన‌ట్టు చెప్పారు. సామాన్యుడికి అర్థ‌మ‌య్యేలా చంద్ర‌బాబు ఇచ్చిన లెక్చ‌ర్ దెబ్బ‌కు ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచింది. కోస్తా ఆంధ్రా ప‌రిధిలోని ప్రాజెక్టుల మీద గురువారం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ప్రాజెక్టుల‌కు క‌నీసం గ్రీజు కూడా పెట్ట‌లేద‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి మొదలుకొని వెలుగొండ వరకు ఏ ప్రాజెక్టును ఈ ప్ర‌భుత్వం పూర్తి చేయ‌లేదు. ఆ విష‌యాన్ని తేట‌తెల్లం చేశారు చంద్ర‌బాబు(CBN America Style) .

నీటి పారుద‌ల మీద అవ‌గాహ‌న‌లేని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

టీడీపీ హయాంలో రూ.21,442 కోట్లు కోస్తా ఆంధ్రా ప‌రిధిలోని ప్రాజెక్టుల‌కు టీడీపీ ఖర్చు పెట్టింది. అదే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,375 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది. ఆ విష‌యాన్ని ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్లో అంకెల‌తో స‌హా ఆధారాల‌ను చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్టారు. మొత్తం 64 ప్రాజెక్టులను తెలుగుదేశం హ‌యాంలో మొదలుపెట్టి 23 పూర్తి చేసింది. మొత్తం 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయ‌గా, కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించిన  (CBN America Style) విష‌యాన్ని వివ‌రించారు.

Also Read : Master CBN : అడ్మినిస్ట్రేట‌ర్ చంద్ర‌బాబు,కొత్త పంథా!

ఏపీలోని 69 నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే నీటి సమస్యే ఉండదని చంద్ర‌బాబు గ్రాఫిక్స్ తో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టినట్లు గుర్తుచేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయవచ్చని చంద్ర‌బాబు చెప్పారు. అయితే, ఏ మాత్రం నీటి పారుద‌ల మీద అవ‌గాహ‌న‌లేని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశార‌ని ఆరోపించారు. మొత్తం మీద చంద్ర‌బాబు  (CBN America Style) బ‌హిరంగ మీటింగ్ ల‌కు దూరంగా ఉంటూ ప్ర‌జ‌ల్ని ఆలోచింప చేసేలా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తున్నారు. ఆమెరికా త‌ర‌హా ప్ర‌చారానికి ఆయ‌న శ్రీకారం చుట్టారు.

Also Read : TDP : మాజీ మంత్రి మాకొద్దంటున్న తెలుగు త‌మ్ముళ్లు.. నియోజ‌క‌వర్గంలో క‌ర‌ప్ర‌తాల పంపిణీ