Chandrababu : రాష్ట్ర ప్రజలనే కాదు సొంత చెల్లెను సైతం జగన్ మోసం చేసాడు

జగన్ తన తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా మోసం చేశాడని ...అందుకే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్నారు

Published By: HashtagU Telugu Desk
Chandrababu (2)

Chandrababu (2)

నవరత్నాలు (Navratnas) పేరుతో ప్రజలను మోసగించిన జగన్.. సొంత చెల్లెను సైతం మోసం చేసాడని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu). జగన్ తన తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా మోసం చేశాడని …అందుకే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్నారు. అన్న, చెల్లి ఇంట్లో పోట్లాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కడప ఏడురోడ్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ..నవరత్నాలు పేరుతో ప్రజలను మోసగించారని, నవరత్నాల్లో ఇసుక, గంజాయి, భూ మాఫియా, మైనింగ్‌, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తులు కబ్జా, సెటిల్‌మెంట్లు దాడులు-కేసులు, శవ రాజకీయాలు ఉన్నాయని
చంద్రబాబు ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

పట్టాదారు పాసు బుక్ ఫై జగన్‌ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా? ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుందన్నారు. అధికారం మదంతో జగన్‌ అరాచకాలు చేస్తున్నారని, దుర్మార్గులు వస్తే పరిశ్రమలు పారిపోతాయన్న చంద్రబాబు, జగన్ దెబ్బకు అమరరాజా, లులూ వంటి పరిశ్రమలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. కూటమి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తాయని పేర్కొన్నారు. రిమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Read Also : AP Elections : 46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధం

  Last Updated: 02 May 2024, 11:43 PM IST