CBN 100 : ఢిల్లీలో మ‌ళ్లీ చ‌క్రం! అల్లుడా మ‌జాకా!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN 100) మ‌ళ్లీ ఢిల్లీ చ‌క్రం తిప్ప‌బోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సానుకూలంగా ఉంది.

  • Written By:
  • Updated On - August 26, 2023 / 02:44 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN 100) మ‌ళ్లీ ఢిల్లీ చ‌క్రం తిప్ప‌బోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సానుకూలంగా ఉంది. దానికి సంకేతంగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా రూ. 100ల నాణెం విడుద‌ల కార్య‌క్ర‌మం కనిపిస్తోంది. ఆ కార్య‌క్ర‌మానికి వైసీపీ లీడ‌ర్ ల‌క్ష్మీపార్వ‌తికి ఆహ్వానం ల‌భించ‌క‌పోవ‌డం చంద్ర‌బాబుకు ఢిల్లీ వేదిక‌గా ప్రాధాన్యం పెరిగిందని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నంగా ఉంది. బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం మొద‌లు పెట్టార‌ని సంకేతాల‌ను ఇస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు మ‌ళ్లీ ఢిల్లీ చ‌క్రం(CBN 100) 

రాష్ట్ర‌పతి భ‌వ‌న్ వేదిక‌గా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ్ఞాప‌కార్థం రూ. 100ల నాణెంను(CBN 100) ఈనెల 28న విడుద‌ల చేస్తున్నారు. ఆ సంద‌ర్భంగా నంద‌మూరి కుటుంబాన్ని, ఎన్టీఆర్ శ్రేయోభిలాషులు, స్నేహితుల‌ను రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్ ఆహ్వానించింది. కానీ, ఎన్డీఆర్ రెండో భార్య‌గా చెప్పుకుంటోన్న లక్ష్మీపార్వ‌తికి మాత్రం ఆహ్వానం లేదు. చ‌ట్ట‌బ‌ద్ధంగా భార్య‌నైన త‌న‌ను కూడా ఆహ్వానించాల‌ని ఆమె రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్ కు లేఖ రాశారు. కానీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము కార్యాల‌యం నుంచి ఎలాంటి ప్ర‌త్యుత్త‌రం లక్ష్మీపార్వ‌తికి లేదు. అంటే, ఎన్టీఆర్ స‌తీమ‌ణిగా రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం లక్ష్మీపార్వ‌తిని గుర్తించ‌లేదు. ఈ ప‌రిణామం తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల‌కు ఉత్సాహాన్ని నింపుతోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ్ఞాప‌కార్థం రూ. 100ల నాణెం ఈనెల 28న విడుద‌ల

వాస్త‌వంగా ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న అవార్డును ఎప్పుడో కేంద్రం ప్ర‌క‌టించాలి. కానీ, ఉద్దేశ‌పూర్వ‌కంగా చంద్ర‌బాబు అడ్డుపడుతున్నార‌ని లక్ష్మీపార్వ‌తి ప‌లుమార్లు ఆరోపించారు. ఎన్డీయే ప్ర‌భుత్వం కేంద్రంలో ఉన్న‌ప్పుడు భార‌త‌ర‌త్నం అవార్డు ప్ర‌క‌టించేలా చేయ‌డం చంద్ర‌బాబుకు పెద్ద స‌మ‌స్య కాద‌ని ఆమె చెబుతారు. ఎందుకంటే, వాజ్ పేయ్ ప్ర‌ధానిగా ఉన్నప్పుడు చంద్ర‌బాబు ఢిల్లీ చ‌క్రాన్ని ఒంటిచేత్తో తిప్పారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ ను ప‌క్క‌న పెట్టార‌ని ఆమె అంటుంటారు. దానికి కార‌ణం లేక‌పోలేద‌ని ఆమె వివ‌ర‌ణ ఇస్తుంటారు. అదేమంటే, ఒక వేళ ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న అవార్డు ప్ర‌క‌టిస్తే, స‌తీమ‌ణి హోదాలో ఆ అవార్డ్ ను త‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఇష్టంలేక భార‌త‌ర‌త్న అవార్డ్ ప్ర‌క‌ట‌న‌ను చంద్ర‌బాబు  (CBN 100) వాయిదా వేయిస్తున్నార‌ని ల‌క్ష్మీపార్వ‌తి ప‌లు వేదిక‌ల‌పై ఆరోపించారు.

ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న అవార్డును

తాజాగా రాష్ట్ర‌ప‌తిభవ‌న్ వేదిక‌గా జ‌గ‌ర‌బోయే రూ. 100ల నాణెం విడుద‌ల (CBN 100) సంద‌ర్భంగా ఎన్టీఆర్ స‌తీమ‌ణిగా గుర్తింపు ల‌భించ‌లేదు. అంటే, రాబోవు రోజుల్లో ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న అవార్డు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ లక్ష్మీపార్వ‌తిని ఎన్టీయే ప్ర‌భుత్వం గుర్తిస్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. ఇక ప్ర‌స్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అత్యంత స‌న్నిహితుడు. అయిన‌ప్ప‌టికీ లక్ష్మీపార్వ‌తికి ఆహ్వానం లేక‌పోవ‌డం అంటే, చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోడీ స‌ర్కార్ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టే. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద చంద్ర‌బాబు భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌లు కోణాల నుంచి విశ్లేషించుకోవ‌చ్చు.

Also Read : CBN-NTR : చంద్ర‌బాబు స‌మేత నంద‌మూరి ఫ్యామిలీ! రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో ఈనెల 28న సంద‌డి!!

ఎన్డీయేలో భాగస్వామి కావాల‌ని చాలా కాలంగా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాతో భేటీ అయ్యార‌ని టాక్‌. అంతేకాదు, రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో ఇటీవ‌ల జ‌రిగిన ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, చంద్ర‌బాబు క‌లుసుకోవ‌డం చూశాం. జీ 20 దేశాల స‌ద‌స్సుకు నివేదిక‌ను త‌యారు చేయ‌డానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించిన సంద‌ర్భంగా ఢిల్లీ వేదిక‌గా చంద్ర‌బాబు, మోడీ క‌లుసుకున్నారు.అప్పుడ‌ప్పుడు ఢిల్లీ వ‌స్తుండాలి అంటూ మోడీ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లోనూ ఆ మ‌ధ్య చ‌ర్చ న‌డిచింది. ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే, రాబోవు రోజుల్లో ఎన్డీయేలో భాగ‌స్వామిగా చంద్ర‌బాబును చేసుకోవ‌డానికి మోడీ, షా ద్వ‌యం సిద్ద‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది.

Also Read : TDP Poll Management : కుటుంబ సార‌థులు వ‌చ్చేస్తున్నారు.!కాస్కోండిక‌!!

ఏపీలోని ఓట‌ర్ల జాబితా తారుమారు కావ‌డాన్ని ఈనెల 28న ఢిల్లీ కేంద్రంగా చంద్ర‌బాబు వెలుగెత్తి చాట‌బోతున్నారు. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కాన్ని ఎండ‌గ‌ట్ట‌బోతున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏపీలోని ఓట‌ర్ల జాబితాను తిరిగి ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. రాబోవు రోజుల్లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు లేకుండా ఓట‌ర్ల జాబితాను త‌యారు చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అంటే, చంద్ర‌బాబుకు సానుకూలంగా కేంద్రం ఉంద‌ని టీడీపీ క్యాడ‌ర్ నమ్మతుంది. అందుకు నిద‌ర్శ‌నంగా ల‌క్ష్మీపార్వ‌తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి ఆహ్వానం లేక‌పోవ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. నంద‌మూరి కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధంలేద‌ని, వీరంగంధం లక్ష్మీపార్వ‌తిగా మాత్ర‌మే ఆమెను గుర్తించాల‌ని టీడీపీ క్యాడ‌ర్ స‌రికొత్త వాద‌న తీసుకొస్తోంది. ఇదంతా చంద్ర‌బాబు ఢిల్లీ కేంద్రంగా తిప్పిన మ‌లుపుగా భావిస్తున్నారు. ఎందుకంటే, ఆహ్వానితుల జాబితా చంద్ర‌బాబుకు తెలియ‌కుండా త‌యారు కాదు. అందుకే, లక్ష్మీపార్వతి లేకుండా చేసుంటార‌ని  స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.