Site icon HashtagU Telugu

Avinash Reddy vs CBI: తాడేపల్లికి సీబీఐ సెగ, అవినాష్ అరెస్ట్ కు కౌంట్ డౌన్?

Viveka

Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ రాజకీయ సెగ పుట్టిస్తుంది. మరో 24 గంటల్లో కీలక వైసీపీ లీడర్ అరెస్ట్ అవుతాడని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీ నుంచి వెల్లడించారు. ఈ కేసులో అసలు బిగ్ బాస్ ను బయటకు రావాలని టీడీపీ నేత బీటెక్ రవి అంటున్నారు. పరిణామాల మీద సీఎం జగన్ స్పందించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఇలా పరోక్షంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy), సీఎం జగన్ చుట్టూ కేసును టీడీపీ తిప్పుతుంది. ఫలితంగా ఏపీ రాజకీయ సెగ వివేకా హత్య విచారణ చుట్టూ అలుముకుంది.

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సొంత బాబాయ్ హత్య కావడమే ఈ సంచలనానికి కారణం. ఇక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ అవుతారా లేదా అన్నది పెద్ద సస్పెన్స్. ఆయన ను పొలిటికల్ బ్లాస్టింగ్ గానే చూడాలి. ఇప్పటిదాకా ఈ కేసు విషయంలో ఆరోపణలు చేస్తూ విమర్శలు ఎక్కు పెడుతూ వచ్చిన తెలుగుదేశం ఆదివారం ఉందయం భాస్కరరెడ్డి అరెస్ట్ జరిగిన తరువాత దూకుడు పెంచింది.

భాస్కరరెడ్డి అరెస్ట్ ని చిన్న చేపతో పోల్చింది. వివేకా హత్య కేసులో పెద్ద చేపలను వదిలేస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి సంచలన కామెంట్స్ చేశారు. సీబీఐ ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేయాలని పెద్ద చేపలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీటెక్ రవి డిమాండ్ చేస్తున్న పెద్ద చేపలు ఏవీ అన్నదే కీలకమైన చర్చ. అసెంబ్లీలో అప్పట్లో సీఎం జగన్ ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ ప్రశ్నించారు. దాని అర్ధం అవినాష్ రెడ్డి (Avinash Reddy) మీద వస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలు అని చెప్పడమే. ఇపుడు ఆ కుడి కన్ను ఎడమ కన్ను పొడుచుకోవడాలు అన్నీ కూడా బీటెక్ రవి సెటైరికల్ గా కామెంట్స్ చేస్తూ ఏ కన్ను ఏ కన్నుని పొడిచిందో చెప్పాలని అంటున్నారు.

తెలుగుదేశం మొదటి నుంచి ఈ కేసు విషయంలో రాజకీయంగా దూకుడుగా ఉంది. ఏ చిన్న విషయం దొరికినా డైరెక్ట్ గా వైసీపీ అధినాయకత్వానికే ముడిపెట్టి ఆరోపణలు చేస్తోంది. ఇపుడు సీబీఐ దర్యాప్తు లో భాగంగా భాస్కరరెడ్డి అరెస్ట్ చాలదన్నట్లుగా మరిన్ని అరెస్టులు జరగాలని టీడీపీ అంటోంది. బీటెక్ రవి కానీ టీడీపీ కానీ కోరుకుంటునందేంటే. ఆ పెద్ద చేపలు ఎవరు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా ఏకంగా వైసీపీ అధినాయకత్వాన్నే నేరుగా టార్గెట్ చేస్తూ ఈ కేసు విషయంలో చేసిన ఆరోపణల మర్మమేంటి? మాజీ మంత్రి వివేకా దారుణ హత్య కేసు విషయంలో వైసీపీ కీలక నేత అరెస్ట్ తో ఏపీలో టీడీపీ రాజకీయం దుమారాన్నే రేపేలా ఉంది.

సీబీఐ దర్యాప్తు ఏమి తేల్చనుంది అన్నదే చూడాలి. ఇక ఈ కేసు నాలుగేళ్ల పాటు ఎటూ తేలకపోవడానికి కారణాలు ఏంటి అంటే సగటు జనాలు లాజిక్ గా ఆలోచిస్తే చాలు వారికి తోచిన తీరున అర్ధమయ్యేవి చెప్పుకుంటున్నారు. వివేకా హత్య కేసులో పులివెందులలో వైసీపీకి కీలకమైన నేతగా ఉన్న వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారింది.

Also Read:  CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఆడివారంకు సరిగ్గా నలభై తొమ్మిది నెలలు అయింది. చిత్రమేంటి అంటే ఎవరూ కర్మలను నమ్మరు కానీ కర్మ సిద్ధాంతం మాత్రం పనిచేస్తుందా అంటే కొన్ని సంఘటనలను బట్టి చూడాలేమో. వివేకా దారుణ హత్యకు గురి అయింది 2019 మార్చి 15. కట్ చేస్తే సీబీఐ తన సుదీర్ఘ దర్యాప్తులో కీలకమైన అడుగులు వేసి బిగ్ షాట్స్ కి గురి పెట్టింది 2023 ఏప్రిల్ 16. క్యాలెండర్ డేట్స్ నంబర్స్ చూస్తే లాజిక్ సరిపోయిందనిపిస్తుంది.

ఈ లాజిక్ ఇలా ఉంటే మరో రెండు హత్యలు కూడా ఎన్నికల్లోపు జరుగుతాయని వైసీపీ రెబెల్ డాక్టర్ డీఎల్ రవీంద్ర రెడ్డి జోస్యం చెప్పారు. అంతే కాదు విజయమ్మ, షర్మిల జాగ్రతగా ఉండాలని ఆయన సూచించడం గమనార్హం. మొత్తం మీద టీడీపీ, వైసీపీ రెబెల్స్ బిగ్ బాస్ ను సీబీఐ విచారించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరో 24 గంటల్ల్లో అరెస్ట్ ఇంకొకటి ఉంటుందని పరోక్షంగా అవినాష్ అరెస్ట్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెబుతున్నారు. ప్రత్యర్థుల దాడి కి అనుగుణంగా అనంతపురం పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే తాడేపల్లి కోటలో సీబీఐ భయం ఉందని అర్థం అవుతుంది.

Also Read:  KKR vs MI IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వృథా.. కోల్‌కతాపై ముంబై ఘనవిజయం..