విజయవాడలో 2007లో సంచలనంగా మారిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు(Ayesha Meera)లో సీబీఐ దర్యాప్తు ముగిసింది. సుమారు ఏడేళ్లుగా సీబీఐ (CBI) ఈ కేసును విచారిస్తోంది. 2018లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పునర్విచారణ ఆదేశించిన తర్వాత మొదట సిట్‌కు బాధ్యతలు అప్పగించారు. కానీ సిట్ దర్యాప్తులో సరైన పురోగతి కనిపించకపోవడంతో, హైకోర్టు సీబీఐకి కేసును అప్పగించింది. శుక్రవారం సీబీఐ అధికారులు విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించారు.
Soundarya Son : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సౌందర్య కొడుకు..!!
సీబీఐ కోర్టులో ఫైనల్ రిపోర్టు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమోదించింది. సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికలను రిజిస్ట్రీలో భద్రపరచాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో సీబీఐ కోర్టుకూ నివేదిక కాపీ అందించాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారం జరపనున్నట్లు హైకోర్టు పేర్కొంది. దీంతో అయేషా మీరా కేసు కీలక మలుపు తిరిగింది.
2007 డిసెంబర్ 27న విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల అయేషా మీరాను అత్యాచారం చేసి, హత్య చేశారు. బాత్రూమ్‌లో ఆమె మృతదేహాన్ని కత్తిపోట్లతో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. కానీ ఆ దర్యాప్తుపై మొదటి నుంచే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడైనా పూర్తి సత్యాన్ని వెలికితీసే దిశగా సీబీఐ నివేదిక ఏ మేరకు స్పష్టతనిస్తుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.