Social Media : సోషల్ మీడియాపై సీబీఐ వేట

జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన సోషల్ మీడియా పై సీబీఐ విచారణ చేసింది.

  • Written By:
  • Publish Date - February 11, 2022 / 11:21 AM IST

జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన సోషల్ మీడియా పై సీబీఐ విచారణ చేసింది. తొలి విడత విజయవాడ కేంద్రంగా ఉండే కొందరిని అదుపులోకి తీసుకుంది. వాళ్ళల్లో కొందరు అప్రువర్ లు గా మారారు. దీంతో వైసీపీ సోష‌ల్‌మీడియా విభాగం డిజిట‌ల్ కార్పొరేష‌న్ కేంద్రంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై విద్వేష విష ప్ర‌చారం జరిగిన వైనం బయటకు వచ్చింది. ద‌ర్యాప్తులో నిర్ధారించిన ఆ మేరకు సీబీఐ బృందం నిర్దారించారని తెలుస్తోంది.డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీసు నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకుంది.ప‌రారీలో డిజిట‌ల్ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో డిజిట‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఐడ్రీమ్ వాసుదేవ‌రెడ్డి తో సహా కొందరు సీరియస్ చర్చలు నడుపుతున్నారని వినికిడి. విజ‌య‌వాడ‌కి చేరుకుని ఏపీ పోలీసు ప్రొటెక్ష‌న్‌లో జడ్జిలపై విద్వేష పోస్టులు పెట్టిన బ్యాచ్‌ ఉందని సమాచారం సీబీఐ వేట‌ మొదలు పెట్టింది. వైసీపీ, ఐడ్రీమ్ సోష‌ల్‌ మీడియా అక్కౌంట్లు ఒక్కొక్క‌టీ డియాక్టివ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో వుంటూ… జ‌డ్జిలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై సోష‌ల్‌ మీడియా ద్వారా విష‌ ప్ర‌చారాన్ని నిర్ధారించిన సీబీఐ కొందరిని అరెస్ట్ చేసింది. తొలి విడ‌త అరెస్ట‌యిన వారిలో అప్రూవ‌ర్లు మారిన లింగారెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, అజ‌య్ అమృత్‌, అవుతు శ్రీధ‌ర్‌రెడ్డి పక్కా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం మీద జడ్జిలపై విద్వేషం చిమ్మిన సోషల్ మీడియా వీరులపై చర్యలు తీసుకోవడానికి సీబీఐ సిద్దం అయింది. అయితే , ఎమ్మెల్యేలు, మినిస్టర్ లు కూడా కొందరు ఆనాడు కామెంట్స్ చేశారు. వాళ్ళ సంగతి ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.