Site icon HashtagU Telugu

CBI Ex-JD : ప్లెక్సీ పోయిందంటూ పోలీసులకు పిర్యాదు చేసిన సీబీఐ మాజీ జేడీ

CBI EX JD

CBI EX JD

అక్రమార్కుల గుండెల్లో, అవినీతి కేసుల్లో రాజకీయ నాయకులకు, టెర్రరిస్టులను గడగడలాడించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు వింత అనుభవం ఎదురైంది. దాని కోసం ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అది ఎందుకు తెలుసా ఓ ఫ్లెక్సీ కోసం. తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీని మాయం చేసిన వారిని వెంటనే పట్టుకొని, శిక్షించాలంటూ ఏకంగా కాకినాడ పోలీసులను కోరారు. అంత పెద్ద మనిషి వచ్చి అడిగిన తర్వాత పోలీసులు ఏమంటారు.. సార్ మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకునే పోలీసు ఉద్యోగంలోకి వచ్చాము.. వెంటనే మీ ఫ్లెక్సీని వెతికి తీసుకువస్తామని చెప్పారు.

ఐపీఎస్ సర్వీసెస్ నుంచి వీఆర్ఆర్ తీసుకున్న వి.వి లక్ష్మినారాయణ వ్యవసాయంపై మక్కువతో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో 12 ఎకరాలు పొలం తీసుకొని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అవగాహన కోసం తన పొలంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీని కొందరు దుండగులు అపహరించారు. తొలుత తన వ్యవసాయ క్షేత్రాన్ని సంరక్షిస్తున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వి.వి లక్ష్మీనారాయణకు నిర్వాహకులు తెలపడంతో నేరుగా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీని మామం చేసిన కేసును త్వరితగతిన విచారణ చేసి.. నిందితులను పట్టుకోవాలని కోరారు. దీంతో అక్కడున్న పోలీసు అధికారులు అయ్యో సార్ మీ పని చేయకపోతే ఎలా సార్ అని.. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పేవారు.

సీబీఐలో పని చేస్తున్న సమయంలో అప్పట్లో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేశారు. అలాగే మైనింగ్ కింగ్ గాలి జనార్థన్‌రెడ్డి కేసును హ్యాండిల్ చేసి దేశ వ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఐపీఎస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొని 2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంపై మక్కువ ఉండటంతో కాకినాడ జిల్లావో ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version