Site icon HashtagU Telugu

CBI: ఆదివారం 6 గంటలు విచారణ, కీలక సమాచారం రాబట్టిన సీబీఐ

Cbi Conducted A 6 Hour Investigation On Sunday And Obtained Key Information

Cbi Conducted A 6 Hour Investigation On Sunday And Obtained Key Information

వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఐదో రోజు కస్టడీ ముగిసింది. సుమారు 6 గంటలకు పైగా విచారించిన అధికారులు.. కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. సీబీఐ (CBI) కస్టడీ ఈ నెల 24తో ముగియనుండగా.. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సీబీఐ సిట్ కోర్టుకు సమర్పించనుంది. మరోవైపు ప్రత్యేక బృందం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఆరా తీసింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్ ఐదో రోజు కస్టడీ ముగిసింది. సుమారు ఆరు గంటలకు పైగా విచారించిన సీబీఐ (CBI) అధికారులు.. విచారణను వీడియో రికార్డు చేశారు. ఆరు రోజుల పాటు భాస్కర్‌ రెడ్డిని, ఉదయ్‌ కుమార్​ను కోర్టు కస్టడీకి అనుమతించగా.. ఈ నెల 25తో ముగియనుంది. సోమవారం విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ ఆధికారులు హాజరుపరచనున్నారు.

ఐదో రోజు కస్టడీలో భాగంగా ఉదయ్‌ కుమార్ నుంచి కీలక సమాచారాన్ని సీబీఐ (CBI) అధికారులు రాబట్టినట్లు సమాచారం. వివేకా హత్య అనంతరం సమాచారం తెలుసుకుని ఆయన ఇంటికి వచ్చి సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యవహారం భాస్కర్‌ రెడ్డి సమక్షంలో జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఇందుకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించాడని ఇప్పటికే సీబీఐ పేర్కొంది. నిన్న సీబీఐ విచారణకు హాజరైన సునీత భర్త, వివేకా అల్లుడు రాజశేఖర్​ ఇచ్చిన సమాచారం అనుగుణంగా ఓ బృందం పులివెందుల వెళ్లగా.. సీబీఐ కార్యాలయంలో మరో బృందం భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్​ను విచారించింది. వివేకా ఇంట్లో నిందితులు భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ ఎంత సేపు ఉన్నారనే సమాచారాన్ని ఇప్పటికే గూగూల్ టేక్‌ అవుట్‌ ద్వారా నిర్ధారించగా.. అదే అంశంపై వాటిని ముందుంచి ఇద్దరినీ విచారించారు.

భాస్కర్ రెడ్డికి వెన్ను నొప్పి దృష్ట్యా ఆయన కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆరు రోజుల కస్టడీ.. సంబంధించిన విచారణను సీబీఐ అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిని సీబీఐ (CBI) బృందం ఆదివారం పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ అధికారులు ఇంటి పరిసరాలను, ఇంట్లో హత్య జరిగిన బాత్రూం, బెడ్ రూమ్ పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు.

వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి ఎంత సమయంలో వచ్చాడన్న విషయమై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు.. ఆ మేరకు తనిఖీకి వచ్చారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ప్రశ్నించిన సిట్ అధికారులు.. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. సోమవారం (ఈ నెల 24వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా, అవినాష్ రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read:  Avinash Reddy: పులివెందులలో క్లూ కోసం సీబీఐ అన్వేషణ