YS Vivekanand Murder Case:జగన్ బాబయ్ హత్య కేసులో నిజాలు బయటపెట్టిన దస్తగిరి…అంతా వాళ్లే చేశారని వాగ్మూలం…?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఎవరో తెలిపోయింది.

  • Written By:
  • Publish Date - November 14, 2021 / 04:34 PM IST

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఎవరో తెలిపోయింది. 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఆయన ఇంట్లోనే హత్యకు గురైయ్యారు. అయితే ఈ కేసు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే చేయించారని ఆరోపణలు చేశారు. అయితే సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కేసు నత్తనడకన సాగింది. చివరికి ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో అసలు నిందితులు బయటపడ్డారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం ఏర్పడింది. వివేకా మాజీ అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమా శంకర్రెడ్డితో పాటు తాను కూడా హత్యలో పాల్గొన్నట్లు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏడాదికి పైగా ఈ కేసును విచారించిన సీబీఐ శనివారం కడప సబ్కోర్టుకు వాంగ్మూలం సమర్పించింది. నవంబర్ 11న దర్యాప్తు సంస్థ సబ్ కోర్టులో దస్తగిరి తరపున అప్రూవర్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడు దస్తగిరి వాంగ్మూలాన్ని సమర్పించాలని ఆదేశించింది.

2019 మార్చి 15న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పులివెందులలోని తన ఇంట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. బెంగుళూరులో 2018-19లో జరిగిన భూ ఒప్పందం ద్వారా వచ్చిన సొమ్మును పంచుకోవడంలో వివాదమే హత్యకు కారణమని స్టెట్మెంట్లో దస్తగిరి తెలిపారు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోవడానికి గంగిరెడ్డె కారణమని వివేకా పలుసార్లు వ్యాఖ్యానించారని తెలిపారు.

దస్తగిరి 2017 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2018 వరకు వివేకానందకు డ్రైవర్గా పనిచేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే వివేకానందకు సన్నిహితుడైన గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, సోదరుడు గజ్జల జగదీశ్వరరెడ్డితో పరిచయం ఏర్పడింది. బెంగళూరు ల్యాండ్ డీల్ ద్వారా వివేకానంద రెడ్డికి రూ.8 కోట్లు వచ్చాయి. ఆ మొత్తాన్ని పంచుకునే విషయంలో గంగిరెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని…నన్ను కావాలనే ఓడించారు.. మీ కథ తేలుస్తానంటూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్ రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి తెలిపారు.

2019 ఫిబ్రవరిలో వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించేందుకు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి గంగిరెడ్డి తనను పిలిచాడని తెలిపారు. ఎర్రగంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి తెలిపారు. కోటి రూపాయలు ఇస్తాం.. వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేశారని….నువ్వొక్కడివే కాదు, మేమూ వస్తాం కలిసి వివేకాను చంపేద్దామంటూ గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు.ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని తనకు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని హత్యకు మొత్తం 40 కోట్ల రూపాయల సుపారీ తీసుకున్నట్లు తెలిపాడు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని తెలిపాడు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానన్న దస్తగిరి… సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేశారని తెలిపాడు.

సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ లోకి దూకి లోపలికి వెళ్లానని… అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు స్టెట్మెంట్ ఇచ్చాడు. తనను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్ళెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్ రూమ్ లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని చెప్పాడు. వివేకా బెడ్ రూమ్ లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని..వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడి చేసినట్టు దస్తగిరి వెల్లడించాడు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేశాడని…వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతీపై 7,8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి తెలిపాడు.