Site icon HashtagU Telugu

Vangaveeti Ranga : కాపు ఓటుపై ‘రంగా’ చ‌రిష్మా

Ranga Vijyawada

Ranga Vijyawada

స్వ‌ర్గీయ వంగ‌వీటి మోహ‌న రంగా భౌతికంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న చ‌రిష్మా ను కాపు సామాజికవ‌ర్గం పెంచుతోంది. రాజ‌కీయ పార్టీలు కూడా ఆయ‌న పేరును ఓటు బ్యాంకు కోసం వాడుకుంటోంది. దీంతో రంగా పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. కృష్ణా జిల్లా రాజ‌కీయం ప్ర‌త్యేకించి విజ‌య‌వాడ పాలిటిక్స్ ఇప్ప‌టికీ వంగ‌వీటి రంగా పేరు చుట్టూనూ తిప్పుంటారు. రంగా మ‌ర‌ణం త‌రువాత ఆయా రాజ‌కీయ పార్టీలు ఆయ‌న సామాజిక‌వ‌ర్గం ఓట్ల కోసం ఆయ‌న పేరును అనుకూలంగా వాడుకోవ‌డం చూశాం. ఆనాడు స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ కూడా రంగా కుటుంబాన్ని ద‌గ్గ‌ర‌కు తీశాడు. ఆ త‌రువాత జ‌గ‌న్ దాన్ని అనుస‌రించాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రంగా కుమారుడు రాధాను చూపుతూ కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను విజ‌య‌వాడలో కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.

విజ‌య‌వాడ కేంద్రంగా ఎంతో కొంత రంగా చ‌రిష్మా ప‌నిచేస్తుంద‌ని రాజ‌కీయ పార్టీల అభిప్రాయం. అందుకే, ఇప్పుడు రంగా పేరును టీడీపీ బ‌య‌ట‌కు తీసుకొస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు రంగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేర‌కు ఆందోళ‌న‌కు. కూడా దిగాడు. పార్టీని సైతం ధిక్క‌రించి ఆయ‌న చేసిన పోరాటం వెనుక టీడీపీ ప‌రోక్షంగా ప్ర‌మేయం లేద‌ని చెప్ప‌లేం. తాజాగా రంగా, రాధా సంక్షేమ మండ‌లి ఉద్య‌మాన్ని చేప‌ట్టింది. విజ‌య‌వాడ‌లోని రంగా విగ్ర‌హాల వ‌ద్ద ధ‌ర్నాలు చేయాల‌ని పిలుపు ఇచ్చింది. అక్క‌డ నుంచి క‌లెక్ట‌ర్ విన‌త‌ప‌త్రం అంద‌చేసే వ‌ర‌కు సోమ‌వారం అందోళ‌న‌కు వెళ్లింది.ఉగాదిలోపుగా విజ‌య‌వాడ కేంద్రంగా రంగా పేరు పెట్టేలా జీవోల ఇవ్వాల‌ని కాపు లీడ‌ర్లుడిమాండ్ చేస్తున్నారు. వాస్త‌వంగా ఎన్టీఆర్ పుట్టిన నిమ్మ‌కూరు గ్రామం గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం లోక్ స‌భ ప‌రిధిలోనిది. ఒక్కో లోక్ స‌భ‌ను జిల్లా గా మార్పు చేసిన జ‌గ‌న్ స‌ర్కార్ 25కు బ‌దులుగా మొత్తం 26 జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. ఆ మేర‌కు ముసాయిదా బిల్లుకు జీవోల‌ను కూడా విడుద‌ల చేసింది. జిల్లాకు సంబంధించిన పేర్ల‌ను కూడా ఆ జీవోల్లో పొందుప‌రిచారు. దానిప్ర‌కారం విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది.

మ‌చిలీప‌ట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని కాపు లీడ‌ర్లు స‌ర్కార్ కు చేస్తోన్న సూచ‌న‌. విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు రంగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కాపు సామాజిక వ‌ర్గం ముక్తకంఠంతో అందుకోసం ఉద్య‌మించాల‌ని ఆ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌కు పిలుపుఇచ్చారు. దీంతో విజ‌య‌వాడ‌తో పాలు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో రంగా విగ్ర‌హాల వ‌ద్ద కాపులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆ సామాజిక‌వ‌ర్గం ఓట్ల కోసం ప్ర‌త్య‌ర్థి పార్టీలు జ‌గ‌న్ స‌ర్కార్ ను బ‌ద్నాం చేయ‌డానికి పూనుకున్నారు. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి ప‌రిపాల‌న ఉండేలా ఏపీ సీఎం జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ప‌రిపాల‌న భ‌వ‌నాల‌ను సిద్ధం చేయాల‌ని ఆదేశించాడు. దీంతో చ‌క‌చ‌కా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఉగాది నాటికి స‌రికొత్త పాల‌న సాగించ‌డానికి ఎన్ని అడ్డంకులు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుండా అడుగులు వేయాల‌ని ఏపీ స‌ర్కార్ క‌దులుతోంది. రాజ‌ధాని త‌ర‌లింపుతో పాటు కొత్త పాల‌న ఏపీలో ఉండాల‌ని జ‌గన్ భావిస్తున్నాడు. ఉగాది లోపు జిల్లాల పెంపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ము హూర్తం ఫిక్స్ కావ‌డంతో లోపుగా అన్నీ క్లియ‌ర్ చేసుకుని జ‌గ‌న్ భావిస్తున్నాడు. సో..కాపులు ఉగాది లోపు రంగా పేరు మీద ఏదో ఒక స్ప‌ష్టత తీసుకోవాల‌ని దూకుడుగా ముందుకు వెళుతున్నారు. వాళ్ల ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో. చూద్దాం.