Gudiwada : `వంగ‌వీటి` ర‌చ్చ‌, కాపు ఓట్ల కోసం పాట్లు! కొడాలికి టీడీపీ ద‌డ !!

వంగవీటి రంగా వ‌ర్థంతి, జ‌యంతి(Gudiwada) సంద‌ర్భంగా రాజ‌కీయ‌ టెన్ష‌న్ నెల‌కొన‌డం

  • Written By:
  • Updated On - December 26, 2022 / 01:26 PM IST

వంగవీటి రంగా వ‌ర్థంతి, జ‌యంతి సంద‌ర్భంగా రాజ‌కీయ‌ టెన్ష‌న్ నెల‌కొన‌డం ఇటీవ‌ల స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. గత ఏడాది వంగ‌వీటి రాధా మీద రెక్కీ నిర్వ‌హించార‌ని వేడిపుట్టించారు. ఆ త‌రువాత ఆ కేసు ఏమైయిందో ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు మ‌ళ్లీ రంగా వ‌ర్థంతి సంద‌ర్భంగా గుడివాడ(Gudiwada) కేంద్రంగా అల‌జ‌డి రేగింది. ఈసారి రంగా వ‌ర్థంతిని ఘ‌నంగా చేయ‌డానికి టీడీపీ గుడివాడ(Gudiwada) విభాగం భారీ ఏర్పాటు చేసింది. దాన్ని జీర్ణించుకోలేని మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని(Nani) వ‌ర్గం ర‌భ‌స‌కు దిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం మీద పెట్రోలు పోసి నిప్పంటించేందుకు వైసీపీ క్యాడ‌ర్ ప్ర‌య‌త్నం చేయ‌డం బీభ‌త్సాన్ని రేపింది. నాని ముఖ్య అనుచరుడైన మెరుగుమాల కాళి ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగింద‌ని టీడీపీ చెబుతోంది.

రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకు వైసీపీ వార్నింగ్(Gudiwada)

వ‌ర్థంతి స‌భ‌ను జ‌ర‌ప‌డానికి లేద‌ని గుడివాడ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకు వైసీపీ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, లేపేస్తామంటూ కొడాలి నాని(Nani) అనుచ‌రుడు కాళి ఇంచార్జి రావిని హెచ్చ‌రించ‌డాన్ని టీడీపీ సీరియ‌స్ గా తీసుకుంది. దీంతో రావి వర్గీయులు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాళి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో కార్యకర్తలతో కలిసి కాళి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపైకి పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. కర్రలు, కత్తులతో దాడిచేశారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

Also Read : Gudivada Politics : కొడాలి `బూతులే` టీడీపీకి గెలుపు బాట‌..!!

వాస్త‌వంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గాలు బ‌లంగా ఉంటాయి. మాజీ మంత్రి కొడాలి రెండు సామాజిక‌వ‌ర్గాల సంయుక్త మ‌ద్ధ‌తుతో వ‌రుస‌గా గెలుస్తున్నారు. దానికి కార‌ణంగా ఆయ‌న స్నేహితుడు వంగ‌వీటి రాధా స‌హ‌కారం అందించ‌డ‌మేన‌ని చాలా మంది చెబుతుంటారు. పార్టీల‌కు అతీతంగా నాని, రాధా ఇద్ద‌రూ మెలుగుతుంటారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం ఉంది. ఈసారి గుడివాడ ఎమ్మెల్మేగా నాని గెల‌వ‌కుండా చూడాల‌ని టీడీపీ పక్కా స్కెచ్ వేసింది. ఆ క్ర‌మంలో రాధాను ఇటీవ‌ల గుడివాడ‌కు పంపింది. ఆయ‌న అక్క‌డ ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా వైసీపీ శ్రేణుల్లో ద‌డ మొద‌ల‌యింది. గుడివాడ‌ టీడీపీ అభ్య‌ర్థిగా రాధాను నిల‌ప‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టాక్ న‌డిచింది. కానీ, రావి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్నారు. ఆయ‌నే రాబోవు రోజుల్లో అభ్య‌ర్థిగా ఉంటార‌ని తెలుస్తోంది.

కాపు ఓట‌ర్ల అండ‌తో ఈసారి గెలుపు

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని కాపు ఓట‌ర్ల అండ‌తో ఈసారి గెలుపును అందుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది. ఆ క్ర‌మంలో రంగా వ‌ర్థింతిని భారీగా చేయాల‌ని ఏర్పాట్లు చేసింది. అదే రోజున వైసీపీ కూడా రంగా వ‌ర్థంతిని చేయాల‌ని రెడీ అయింది. ఇలా రెండు పార్టీలు పోటీ ప‌డి వ‌ర్థంతి స‌భ‌ను నిర్వ‌హించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే వివాదానానికి కార‌ణం అయింది. ఆనాడు రంగాను చంద్ర‌బాబునాయుడు చంపించాడ‌ని చాలా కాలంగా వైసీపీ ద‌మ్మెత్తిపోస్తోంది. దానికి విరుగుడుగా వంగ‌వీటి రాధా తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రో చేసిన హ‌త్య‌ను టీడీపీకి అంట‌గ‌ట్ట‌డం మంచిది కాద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వ‌ర్థంతిని నిర్వ‌హించ‌డం ద్వారా కాపుల‌కు మరింత ద‌గ్గ‌ర‌కావాల‌ని టీడీపీ భావించింది. దాన్ని అడ్డుకోవ‌డానికి వైసీపీ చేసిన ప్ర‌య‌త్నం మాచ‌ర్ల త‌ర‌హా బీభ‌త్సాన్ని గుడివాడ‌లో త‌ల‌పించింది.

గుడివాడ కేంద్రంగా జ‌రిగిన ఈ వివాదం సంద‌ర్భంగా పోలీసులు ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ కార్యాల‌యంపై పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్ట‌డానికి వ‌చ్చిన కాళితో పాటు అత‌ని అనుచ‌రులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది. వాళ్ల ప‌ట్ల పోలీసులు మెత‌క‌వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తోంది. బీభ‌త్సం చేయ‌డానికి వ‌చ్చిన వాళ్ల‌ను పోలీసులు బ్ర‌తిమాలాడుతున్నార‌ని టీడీపీ ధ్వ‌జ‌మెత్తింది. వ‌ర్థంతిని జ‌ర‌ప‌డానికి టీడీపీ సిద్ధం అయింది. ఆ క్ర‌మంలో గుడివాడ అంత‌టా ఉద్రిక్త‌త నెల‌కొంది. ప్ర‌తి ఏడాది స్వ‌ర్గీయ రంగా వ‌ర్థంతి, జ‌యంతి సంద‌ర్భంగా ఇలాంటి ప‌రిస్థితులు రావ‌డం రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా కొంద‌రు భావిస్తున్నారు. ఇదంతా కాపు ఓట‌ర్ల కోసం జ‌రిగే హ‌డావుడిగా మరికొంద‌రు విశ్వ‌సిస్తున్నారు.

Also Read : Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!