Whats Today : ఏపీలో కుల గణన షురూ.. నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన

Whats Today : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 08:06 AM IST

Whats Today : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌‌లో కేసీఆర్ ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సభ ముగియగానే  కేసీఆర్ నేరుగా మెదక్‌లోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్స్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎస్‌ఐ గ్రౌండ్‌లోనే హెలీ ప్యాడ్ కోసం ఏర్పాట్లు చేశారు. పక్కనే సభాస్థలిని కూడా సిద్ధం చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్‌లోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్స్‌లో సభ జరుగుతోంది. గులాబీ బాస్ ఇప్పటికే 70 నియోజక వర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు.

  • ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు.. ఈసందర్భంగా వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన స్థలం వద్ద నిర్వహించే సభలో ప్రసంగించనున్నారు.
  • ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బోథ్, నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 11గంటలకు బోథ్, మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్, సాయంత్రం 4 గంటలకు జనగాం బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు.
  • ఈరోజు నుంచి ఏపీలో కుల గణన ప్రారంభం అవుతుంది. 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణనను ప్రారంభిస్తారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియ మొదలవుతుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రెండు రోజుల పాటు కుల గణన ప్రయోగాత్మకంగా జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • తిరుమలలో 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
  • ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటించనున్నారు.
  • ఇవాళ బెజవాడలో సీపీఎం భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఇందులో సీపీఎం అగ్ర నేతలు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజా సంరక్షణ యాత్ర పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
  • ఇవాళ వైసీపీ సామాజిక సాధికార యాత్ర  14వ రోజు.. నర్సన్నపేట – శ్రీకాకుళం జిల్లా, పొన్నూరు – గుంటూరు జిల్లా, హిందూపూర్ – శ్రీసత్య సాయి జిల్లాలో బస్సు యాత్ర(Whats Today) జరుగుతుంది.

Also Read: Madhuyashki : మధుయాష్కీ నివాసంలో సోదాలు.. హయత్‌నగర్‌లో ఉద్రిక్తత