వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ఫిబ్రవరి 19, 2025న గుంటూరు మిర్చి యార్డులో చేసిన పర్యటన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Election Code) అమలులో ఉండగా, జగన్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రైతులను పరామర్శించేందుకు యార్డుకు వెళ్లారు. దీంతో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో జగన్‌తో పాటు వైసీపీ నేతలైన కావటి మనోహర్, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వెంకటరమణ, కొడాలి నాని, అంబటి రాంబాబు, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు వీరికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
Nabha Natesh : నభా..అబ్బబ్బా! టెమ్ట్ చేస్తోన్న కన్నడ భామ
ఈ కేసుపై స్పందించిన వైసీపీ నేతలు, తమ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని, అందుకే ఎన్నికల కోడ్ తమపై వర్తించదని వాదిస్తున్నారు. జగన్ మిర్చి రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్లారని, ఎటువంటి మైక్ వాడలేదని, ఇది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేకుండా పెద్ద ర్యాలీ జరిపారనీ, కోడ్ ఉల్లంఘన జరిగిందనే అభిప్రాయంతో కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజకీయ కార్యక్రమం ఏదైనా నిర్వహించాలంటే ముందుగా అనుమతి అవసరమని వారు గుర్తుచేశారు.
ఇటీవల కాలంలో జగన్ పర్యటనలపై వివాదాలు, ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు నియమాలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. గతంలో నమోదైన కేసులను కూడా తిరిగి పరిశీలించి, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.