వైసీపీ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy )పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. టీడీపీ నేత ప్రసన్న కుమార్ (TDP leader Prasanna Kumar) ఈ ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు అయ్యింది. ఫిర్యాదులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై పరుష వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
BRS Diksha Divas : బిఆర్ఎస్ కు బిగ్ రిలీఫ్
వివరాల్లోకి వెళ్తే.. బోగోలు మండలం కోళ్లదిన్నెలో ఇటీవల టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆసుపత్రిలోనూ ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో వైసీపీ వర్గీయులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన కాకాణి, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ప్రసన్న కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.