Site icon HashtagU Telugu

Perni Nani Wife Jayasudha : పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు

Perninani Wife

Perninani Wife

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం (Ration rice in Andhra Pradesh) అక్రమ రవాణా కేసు మరింత స్పీడ్ అందుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ(Nani’s wife, Jayasudha)పై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు (Machilipatnam police registered a case) చేశారు. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జయసుధ పేరిట పేర్ని నాని ఒక గిడ్డంగి నిర్మించారు. ఈ గిడ్డంగిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే, ఇటీవలి పోలీసుల తనిఖీల్లో ఈ గిడ్డంగి ఉపయోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ గిడ్డంగిలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగపడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గిడ్డంగిలో జరిగిన అక్రమాలను గుర్తించిన అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా, గిడ్డంగి నిర్వహణలో జరిగిన లోపాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. జయసుధపై నమోదు అయిన కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తక్షణమే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు , శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని వాదన మరోలా ఉంది.గోడౌన్‌లో ఉంచిన బియ్యాన్ని తరలించే సమయంలో తరుగు వచ్చిందని పేర్ని నాని చెప్తున్నారు. సుమారుగా 3,200 బస్తాలు తరుగు ఉన్నాయంటున్న పేర్ని నాని.. ఆ బియ్యానికి సంబంధించిన సొమ్మును చెల్లిస్తానని చెప్పారు. ఈ మేరకు నవంబర్ 27న పేర్ని నాని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌ గీతాంజలి శర్మకు లేఖ కూడా రాశారు. అయితే ఆ తర్వాతే పౌరసరఫరాల శాఖ అధికారులు గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. నవంబర్ 27. 28వ తేదీల్లో పేర్ని నాని గోడౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లో 3,700 బస్తాల బియ్యం తగ్గాయని గుర్తించారు. టన్నుల లెక్కన చూస్తే.. 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.

Read Also : Collectors Conference : ఈ అక్ర‌మాల‌ను అరిక‌ట్ట‌డం కలెక్టర్ల బాధ్యత కాదా ? : పవన్ కళ్యాణ్