Site icon HashtagU Telugu

EX CM Jagan : మాజీ సీఎం జగన్ ఫై కేసు నమోదు..అసలైన ఆట మొదలైందా..?

Case File On Jagan

Case File On Jagan

గడిచిన ఐదేళ్లలో ఏపీ (AP)లో ఎలాంటి దారుణాలు జరిగాయో తెలియంది కాదు..అధికారం తమదే అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (EX CM Jagan) దగ్గరి నుండి కింద స్థాయి నేతలు , అధికారులు ఇలా ఎవ్వరు పడితే వారు రాష్ట్రాన్ని దోచుకున్నారు..దాచుకున్నారు..రాష్ట్ర ఖజానా ఖాళీ చేసారు. ఇదేంటి అన్నవారిపై కేసులు పెట్టడం..మాజీ సీఎం (Chandrababu) లు అని చూడకుండా జైల్లో పెట్టడం..ఎంపీలను , మాజీ ఎంపీ లని కూడా చూడకుండా జైల్లో పెట్టి పోలిసుల చేత కొట్టించడం..మాస్క్ అడిగిన పాపనికి నడి రోడ్ ఫై ఓ డాక్టర్ ను అర్ధనగ్నంగా నిలబెట్టి కొట్టడం ఇవన్నీ ఎన్నో చేసారు..వాటికీ అన్నింటికీ వడ్డీతో సహా కూటమి బదులు తీర్చుకోవడం మొదలుపెట్టింది. అసలైన ఆట (Game) ఏంటో చూపించబోతుంది. ఇప్పటికే పలువురి నేతలే కేసులు పెట్టిన సర్కార్..ఇప్పుడు మాజీ సీఎం , జగన్ (Case File on jagan) ఫై కూడా కేసు నమోదు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ లపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని RRR ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని తెలిపారు. IPS సీతారామాంజనేయులు, అప్పటి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్పైనా కేసు బుక్ అయింది. 2021లో రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెల్సిందే. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు రఘురామరాజు.. సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై పిర్యాదు చేసారు. RRR ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద సునీల్ కుమార్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేశ్‌కు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also : Gujarat : దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిదర్శనం ఇదే..