స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ..శనివారం నంద్యాలలో సందడి చేసాడు. తన స్నేహితుడు నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra kishore Reddy ) కి మద్దతు పలికేందుకు ఆయన ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో రవిచంద్ర కిషోర్ రెడ్డి ..అల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ ఏర్పాటు చేసారు. ఇక బన్నీ వస్తున్నాడని తెలిసి అభిమానులు , పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అయితే ర్యాలీ కి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ జరపడడంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి తో పాటు అల్లు అర్జున్ ఫై పోలీసులకు రిటర్నింగ్ అధికారి పిర్యాదు చేసారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ , రవిచంద్ర ఫై కేసు నమోదు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి మద్దతు తెలుపడం పట్ల మెగా అభిమానులు, జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క వైసీపీ ని ఓడించాలని కూటమిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ రెండు నెలలుగా కష్టపడుతుంటే..కనీసం ఆ మాత్రం కూడా అర్ధం చేసుకోకుండా వైసీపీ అభ్యర్ధికి ఎలా మద్దతు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కు సింగిల్ ట్వీట్ చేయడం ఏంటి..వైసీపీ అభ్యర్థి కోసం ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్పటికీ అల్లు అర్జున్ చేసిన పనికి ఎవ్వరికి నచ్చడం లేదు.
Read Also : AP Elections : ఓటు వేసేందుకు సొంతూళ్లకు వేలాదిగా నగరవాసులు