Site icon HashtagU Telugu

CM Ramesh: 450 కోట్ల ఫోర్జరీ కేసులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌

CM Ramesh

CM Ramesh

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు ఊహించని షాక్ తగిలింది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో రూ.450 కోట్ల నిధుల దుర్వినియోగంపై సీఎం రమేష్‌పై ప్రముఖ టాలీవుడ్ హీరో వేణు ఫిర్యాదు చేశారు. వేణు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వేణు ఫిర్యాదును పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో నటుడు వేణు తరపున కావూరి భాస్కర్ రావు వాంగ్మూలం ఇచ్చారు.

కాగా సీఎం రమేష్‌ కుటుంబానికి చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కాంగ్రెస్‌కు రూ.30 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (RPPL) రూ.1,098 కోట్ల ఇంజినీరింగ్, సేకరణ మరియు నిర్మాణ కాంట్రాక్టును పొందింది. ఆంతేకాదు జనవరి 27, 2023న టీడీపీకి రూ. 5 కోట్లు విరాళంగా అందించింది. రమేష్ టీడీపీని వీడి 2019లో బీజేపీలో చేరారు. కర్ణాటకలోని జనతాదళ్ కి ఇదే కంపెనీ 10 కోట్లు విరాళంగా ఇచ్చింది.

Also Read: SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ లో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం, 7 సిక్స్‌లతో వీర విహారం