Tirupati: దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా

దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేమని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

  • Written By:
  • Updated On - November 14, 2021 / 11:41 PM IST

తిరుపతి: దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమైన సహకారం లేకుండా భారతదేశ అభివృద్ధిని ఊహించలేము, ”అని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన దక్షిణ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశంలో ప్రసంగిస్తూ హోంమంత్రి అమిత్ షా అన్నారు.
కోవిడ్ -19కి వ్యతిరేకంగా రెండవ డోస్ టీకాలు వేసే రేటును వేగవంతం చేయాలని షా రాష్ట్రాలను కోరారు మరియు ముఖ్యమంత్రులు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను రాష్ట్రాలు ఏమాత్రం సహించకూడదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడీ :

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్వాగతించారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా విభజన హామీలు అమలు కాలేదని… పోలవరానికి విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఖర్చు చేశారన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశం నెరవేరలేదని… తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని ఏసీ సీఎం జగన్ కోరారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు ఊరట కలిగించాలన్నారు. ఏపీ, తెలంగాణల మధ్య ఆస్తుల పంపకం జరగలేదని, రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను సవరించాలని జగన్ వెల్లడించారు.

ఈ సమావేశానికి దక్షిణ భారత ఐదు రాష్ట్రాల సీఎంలలో ముగ్గురు గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొంటుండగా…తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సమావేశానికి గైర్హాజరైయ్యారు.అయితే వీరి త‌రుపున ఆయా రాష్ట్రాల త‌రుపున ప్ర‌తినిధులు హాజ‌రైయ్యారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌ రంగస్వామి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డీకే జోషి, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రఫుల్‌ పటేల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్

ఇదిలావుండగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అడ్డుకోవాల‌ని చూసిన సీపీఐ పిలుపునిచ్చింది. ఈ సంద‌ర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, పార్టీ కార్య‌కర్త‌ల‌ను ముంద‌స్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.