YSRCP MLA : ఏకంగా రూ.908 కోట్లకు టోకరా వేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి బ్యాంకులకు ఏకంగా రూ.908 కోట్లకు టోకరా పెట్టాడు

Published By: HashtagU Telugu Desk
mla duddukunta sreedhar reddy

mla duddukunta sreedhar reddy

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి (Duddukunta Sreedhar Reddy) బ్యాంకులకు ఏకంగా రూ.908 కోట్లకు టోకరా పెట్టాడు. సామాన్యులకు లక్ష రుణం ఇవ్వాలంటే వంద ప్రశ్నలు వేసికాని బ్యాంకులు రుణం ఇవ్వవు. కానీ ధనవంతులు , రాజకీయ నేతలు , బిజినెస్ మాన్ లకు మాత్రం ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండా కోట్ల రుణాన్ని ఇస్తుంటాయి. పోనీ వారేమైనా కడతారా అంటే అది లేదు. అదే సామాన్య ప్రజలను ముక్కుపిండి వసూళ్లు చేస్తారు. వేలకు వేల కోట్లు బ్యాంకులకు పంగనామాలు పెట్టి విజయ్ మాల్యా దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన్ను రప్పించేందుకు ప్రభుత్వం ముప్పుతిప్పలు పడుతోంది. దేశ వ్యాప్తంగా విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారు ఎంచక్కా తిరిగేస్తున్నారు.

తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి ఒకటి కాదు వంద కాదు ఏకంగా రూ.908 కోట్లకు టోకరా పెట్టి వార్తల్లో నిలిచారు. మెసర్స్‌ ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భార్య అపర్ణరెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి షూరిటీగా కంపెనీ రుణాలు తీసుకుంది. ఈ కంపెనీ పేరుతో తీసుకున్న లోన్లు ఏప్రిల్‌ 30 నాటికి వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయ్యింది. అవి కట్టాలని బ్యాంకు (Canara Bank) శ్రీధర్ రెడ్డి చుట్టూ తిరుగుతుంటే అవి కట్టలేమని చేతులెత్తేశారు.

తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పనులు చేపట్టిండనై , చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోతున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి (MLA Duddukunta Sreedhar Reddy) చెపుతున్నాడు. శ్రీధర్ రెడ్డి తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించకపోవడంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ప్రకటనలో తెలిపింది. కానీ శ్రీధర్ రెడ్డి ఆస్తులు రూ.50 వేల కోట్లకు మించి వస్తువులు విలువ చేయవని తేలింది. దీంతో మిగతా రూ.858 కోట్ల మాటేమిటన్న ప్రశ్నకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నుంచి రెస్పాన్స్ లేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆ ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధపడుతున్నారు.

ఇక శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. గతంలో ఏదో ఉద్యోగం చేసేవాడు. కానీ తరువాత కాంట్రాక్టర్ గా మారారు. వైస్సార్సీపీ ఆవిర్భావంతో పొలిటీషియన్ గా అవతారమెత్తారు. 2014 ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానానికి వైస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో మాత్రం పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు.

Read Also : Jagan : అమ్మాయిలను లోబర్చుకొని పెళ్లిచేసుకోవడం.. నాలుగేళ్లు కాపురం చేసే వదిలేయడం ఇదే దత్తపుత్రుడి క్యారెక్టర్ – జగన్

  Last Updated: 21 Jul 2023, 04:24 PM IST