Site icon HashtagU Telugu

Call Money : కృష్ణాజిల్లాలో బుస‌లు కొడుతున్న కాల్ నాగులు

Call Momney Imresizer

Call Momney Imresizer

కృష్ణాజిల్లాలో మ‌ళ్లీ కాల్ మ‌నీ వేధింపులు మొద‌లైయ్యాయి. గన్నవరం మండలం మాధలవారి గూడెంలో ఇటుకబట్టి నడుపుతున్న ఓ వ్యాపారి కి కాల్‌మ‌ని వ్యాపారుల నుంచి వేదింపులు వ‌స్తున్నాయి. తీసుకున్న డబ్బు చెల్లించలేదని బెదిరించి ఇంకా డబ్బులు ఇవ్వాల‌ని ఇటుక బ‌ట్టి వ్యాపారితో వ‌డ్డీ వ్యాపారులు నోట్లు రాపించుకున్నారు. కొల్లా వెంకట రత్నం దగ్గర 25 లక్షలు అప్పు తీసుకుంటే డబ్బులు చెల్లించిన అధిక వడ్డీ రేట్లు వేసి ఇంకా డబ్బులు కట్టాలని వేదిస్తున్నాడని ఇటుక బ‌ట్టి వ్యాపారి కన్నీరు మున్నీరవుతున్నాడు. రైలు పట్టాలు వద్దకు లాక్కొని వెళ్లి బెదిరింపులకు గురి చేసి అధిక సొమ్ము ఇవ్వాలని కొల్లా వెంకట రత్నం అతని తమ్ముడు నోటు రాపించికున్నార‌ని భాధితుడు తెలిపాడు.

నిన్న ఇటుకబట్టి దగ్గరకి వచ్చి ఇటుక బట్టి దగ్గర ఉన్న సి.సి.కెమెరాలు బాక్సులు పగలు కొట్టి పడుకొని ఉన్న తన భర్తను బయటకు లాక్కొచ్చి ఇటుక రాయి తో తల పగలు కొట్టారని బాధితుడి భార్య ఆరోపించింది. ఈ దాడిలో వెంకట రత్నం తో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంకో బయట వ్యక్తులు ఉన్నారని తెలిపింది. కావాలనే మా పై కక్ష పూరితంగా చేస్తున్నారని.. త‌మ‌ను చంపేస్తాం అని బెదిరింపులు గురిచేస్తున్నారని బాధితుడు గన్నవరం పోలీసులు ఆశ్రయించాడు. త‌మ‌కు ప్రాణ హని ఉంద‌ని.. త‌మ‌కు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత వెంకట రత్నం అతని కుటుంబ సభ్యులే కార‌ణ‌మ‌ని బాధితులు పోలీసుల‌కు తెలిపారు. త‌మ‌కు భద్రత ఇవ్వాలని జిల్లా ఎస్పీ నీ బాధితులు కోరారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన గ‌న్న‌వ‌రం పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version