Site icon HashtagU Telugu

AP Cabinet : ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు గ్రీన్ సిగ్నల్

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ముఖ్య నిర్ణయాలతో ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 13 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపిన తర్వాత, అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన సంబంధిత బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Surekha Yadav : భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన సురేఖా యాదవ్

ప్రత్యేకంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం రూపొందించిన వాహనమిత్ర పథకం(Vahana Mitra)పై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనుంది. రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటను కలిగించనుంది. అలాగే, రాజధాని పరిధిలో గతంలో చేపట్టిన 343 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా, స్థానిక రైతులకు ఉపశమనం లభించనుంది.

ఇకపోతే ప్రజలకు భారం అవుతున్న నాలా ఫీజు అంశంపైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరించే బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నగరాల్లో గృహనిర్మాణం చేసేవారికి అదనపు భారాన్ని తగ్గించనుంది. మొత్తంగా చూస్తే, ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఊరట కలిగించేలా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయని చెప్పాలి.

Exit mobile version