Site icon HashtagU Telugu

AP ByPoll : ఏపీలో ఉప ఎన్నికలు.. కొన్ని ఖాళీ స్థానాలకే మాత్రమే

Ap Bypoll

Ap Bypoll

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు (MPTC , ZPTC ) ఖాళీగా ఉండటంతో, ఆయా ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరిగే పూర్తి స్థాయి ఎన్నికలు కాదని, కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే జరుగుతాయని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జూలై 28న అధికార నోటిఫికేషన్ విడుదలైంది.

ఉప ఎన్నికలు జరగనున్న ఖాళీ స్థానాల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎంపీటీసీ స్థానాల్లో రామకుప్పం, కారంపూడి, విడవలూరు, జడ్పీటీసీ స్థానాల్లో పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే సర్పంచ్ పదవులకు కొండపూడి, కడియపులంక గ్రామాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు జరుగుతుంది.

CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 12న నిర్వహించి, ఆగస్టు 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు 10న నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే స్థానాలు పరిమితమై ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, న్యాయంగా జరిగేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఎన్నికలు జరగవని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.