ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) అసెంబ్లీలో మాట్లాడుతూ.. **GST-02 సంస్కరణల ఫలాలు అందరికీ చేరేలా ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీ ద్వారా నూతన సంస్కరణలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా, సాధారణ ప్రజలకు, వ్యాపార వర్గాలకు, పరిశ్రమలకు వాస్తవ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం మాత్రమే కాకుండా, ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
Petrol Price : డీజిల్, పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గించండి – KTR
స్వదేశీ ఉత్పత్తులకు, “మేక్ ఇన్ ఇండియా” (Made in India) పథకాలకు ఈ సంస్కరణలు బలంగా నిలుస్తాయని చెప్పారు. దేశీయంగా తయారయ్యే వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లలో గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగడానికి ఈ విధానం తోడ్పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, గట్టి పోటీని ఎదుర్కొనే సామర్థ్యం మన పరిశ్రమలకు వస్తుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. ప్రజలు కూడా ఎక్కువగా దేశీయ వస్తువులనే కొనుగోలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
దసరా నుంచి దీపావళి వరకు ఈ సంస్కరణలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలలో అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యాపారుల నుంచి రైతుల వరకు అందరికీ ఇది లాభదాయకంగా మారేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు. ఈ విధంగా, GST-02 సంస్కరణలు ఆర్థిక రంగానికే కాదు, సమాజంలో ప్రతి వర్గానికీ మేలు చేసేలా మారుతాయని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
