ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

Andhra Pradesh  ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో […]

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu extends Eruvaka Purnima greetings to farmers.

CM Chandrababu extends Eruvaka Purnima greetings to farmers.

Andhra Pradesh  ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల చేశారు.

అయితే, ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారు తాము నష్టపోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం మరో వెసులుబాటు కూడా కల్పించింది. అటువంటి వారు పొందే రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం పన్ను బిల్లులో సర్దుబాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో, బకాయిల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

  Last Updated: 17 Mar 2026, 11:29 AM IST