Kadiri భవనం కూలిన శిధిలాలు పక్క బిల్డింగ్ లపై పడడంతో కూలిపోయిన మరో రెండు భవనాలు

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో కదిరిలో వర్షానికి తడిచి మూడంతస్తుల భవనం కుప్పకూలింది.

Published By: HashtagU Telugu Desk

కదిరి, అనంతపురం: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో కదిరిలో వర్షానికి తడిచి
మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

ఘటన జరిగిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలిస్తున్నారు.

మూడు అంతుస్తుల పాత భవనం వర్షానికి తడిచి కూలిపోయి పక్కనే ఉన్న రెండు అంతస్తుల భవనంతో పాటు, మరో ఇంటిపై కుప్పకూలింది. దీంతో ఆ రెండు భవనాలు కూడా కూలిపోయాయి.

గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే పాత భవనం గోడలు కూలి ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే ప్రాణనష్టం అంచనా వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

  Last Updated: 20 Nov 2021, 09:51 AM IST